కథ : హరిత సిరి...సత్య మొండ్రేటి

కథ : హరిత సిరి...సత్య మొండ్రేటి

శీర్షిక: హరిత సిరి

"సిరిపల్లె" సిరులతో తులతూగే పల్లె. మా అమ్మమ్మ గారి  ఊరు
శెలవుల కు ఎంతో ఆనందంగా
వెళ్ళేవాళ్ళం.విదేశాలు వెళ్ళినా
రాని ఆనందం అమ్మమ్మ ఊరు
లో మాకు కలిగేది... పల్లెకు పోదాం అల్లరి చేద్దాం చలో చలో అంటూ పిల్లలమంతా బయలుదేరే వాళ్ళం. బస్సు దిగగానే... పచ్చని పల్లెటూరి అందాలు.. పంట చేలు.. నారికేళ వృక్షాలు మాకు స్వాగతం పలికారు.. ఎద్దుల బండి లో ఎగుడు దిగుడుల
ప్రయాణం మాకు బలే మజా అనిపించింది. విమానంలో వెళ్ళిన కలుగని మధురానుభూతి కలిగింది.
ఎద సెలయేరులా ఉరికింది పరవశించి పరుగులు తీసింది
పల్లె వైపు..
తుషార మధువనిలో మంచు కురిసిన వేళలో మాది పులకరించి పరవశించింది పచ్చని చేల ప్రకృతిలో మేను
మురిసింది. సుందరమైన పల్లె సొగసుల సోయగాలు... ఆత్మీయతా అనురాగాల పల్లె మనుషులు కల్మషం ఎరుగని భూదేవి పూలు....
మైమరిపించే మట్టి సుగంధాలు
ప్రగతికి పట్టుకొమ్మలు మన పల్లెటూళ్ళు అన్న గాంధీజీ ఆశల పొదరిల్లు... గాంధీ కల రూపాలు.. మన పల్లెటూళ్ళు..
సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు.. కట్టుబాట్లకు కంకణాలు అన్నదాత లోగిళ్ళు
ఆదరణ కు ఆనవాళ్ళు దానధర్మాలకు దర్పణాలు
ఆత్మీయపలకరింపులుతో
అమ్మమ్మ ఇల్లు చేరాము
ఊహించని ఆతిథ్యం తో ఒక్కరి బిక్కిరి అయ్యాము... కొసరి కొసరి వడ్డించే అమ్మమ్మ ప్రేమ ముందు ఏ ప్రేమ సరితూగదు.
తాతయ్య తో గ్రామ దర్శనం.
చెరువు లో ఈత లు... వృక్షాలు నీడలో ఆటలు ఉయ్యాల కాపులు... గోధూళి వేళ ఆవుల మందలు.. పల్లె పశుసంపద చూస్తూ సెలవులు పల్లెలో ఆహ్లాదకరంగా గడిపి పునర్ దర్శనాన్ని ఊహిస్తూ ...  జ్ఞాపకాలను మది నినింపుకొని
కాలుష్యకారడవికి వచ్చాం
పల్లెల అందాలు ప్రకృతి బంధాలు.. ఎంత వర్ణించినా తరగని నిధులు... సిరి సంపదలతో మన పల్లె లు వర్ధిల్లాలి. పచ్చని చెట్టు లాంటి పల్లెటూళ్ళ వర్ధిల్లాలి

పేరు :శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు :హైదరాబాద్
హామీ పత్రం :కథానిక నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.


0/Post a Comment/Comments