పోలయ్య కవికి... భగవద్గీత కవితకు బహుమతి... హిమాలయ శివసాయి గురూజీచే ఘన సన్మానం...

పోలయ్య కవికి... భగవద్గీత కవితకు బహుమతి... హిమాలయ శివసాయి గురూజీచే ఘన సన్మానం...

పోలయ్య కవికి...భగవద్గీత కవితకు...బహుమతి
హిమాలయ శివసాయి గురూజీచే... ఘనసన్మానం

హైదరాబాద్ పుచ్చపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో
వాల్మీకి మహర్షి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో
శనివారం పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా జరిగింది

కళారత్న బిక్కికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో
డా. వి .డి.రాజగోపాల్ రచించిన" గీతావలోకనం" పుస్తకాన్ని హిమాలయ శివసాయి గురూజీ మరియు "కథానికలతో... కాసేపు" పుస్తకాన్ని ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్  ఆవిష్కరించారు... శ్రీమతి రాజావాసిరెడ్డి మళ్ళీశ్వరి  శ్రీమతి పావనేశ్వరి క్లుప్తంగా సౌందర్యంగా పుస్తక విశ్లేషణ చేశారు

అధ్యక్షులు కళారత్న బిక్కికృష్ణ మాట్లాడుతూ ఈ రెండు పుస్తకాలను ప్రముఖ రచయిత డా.వి.డి రాజగోపాల్ అలతి అదితి పదాలతో అతి సుందరంగా అత్యద్భుతంగా
అందరికీ అర్థమయ్యే రీతిలో రచించారని ప్రశంసించారు
డా.రాజగోపాల్ తనలోని కవిని గుర్తించి ప్రోత్సాహించిన గురువు బిక్కికృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ సభకు ప్రపంచ తొలి గీతావధాని డా.యడవల్లిమోహన్ రావు వాల్మీకి గ్రూప్ కార్యదర్శి లయన్ ఎం. అరుణ కుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భగవద్గీత కవితల పోటీల్లో  ప్రముఖ కవి రచయిత పోలయ్య కవి వ్రాసిన భగవద్గీత...ఓ అక్షయ పాత్ర...ఓ అమృత భాండం అను కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసి నగదు బహుమతిని ప్రకటించారు

వారి సాహితీ సేవలకు గుర్తింపుగా హిమాలయ శివసాయి గురూజీ కళారత్న బిక్కికృష్ణ డా.విడి రాజగోపాల్  పోలయ్య కవిని మెమెంటో శాలువా పుష్పగుచ్ఛాలతో రెండు పుస్తకాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.

పోలయ్య కవి మాట్లాడుతూ గతనెలలో తనకు మూడు సన్మానాలు జరిగాయని ఈ నూతన సంవత్సరంలో తాను మూడురోజులు కష్టపడి వ్రాసిన "భగవద్గీత కవితకు" నగదు బహుమతి రావడం హిమాలయ శివసాయి గురూజీ చే సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉందని, తాను ఈ కరోనా కాలంలో వ్రాసిన 1500 కవితలకు పడిన కష్టానికి మంచి గుర్తింపే వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తనకీ సన్మానం చేసిన శివసాయి గురూజీకి బిక్కికృష్ణకి
మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు డా.వి.డి రాజగోపాల్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు

తనకు జరిగిన ఈ సన్మానానికి తనను అభినందించిన నిత్యం అభిమానించే ప్రోత్సాహించే తోటి కవిమిత్రులు అభిమానులు ముత్యం వెంకటేశ్వరరావు కొప్పుల ప్రసాద్ బోయ వెంకటేశం  త్రినాథరావు  రవికాంత్ శర్మ  ఆర్ ప్రవీణ్
జె బి కుమార్ చేపూరి  ఆదెయ్య  కృష్ణమూర్తి  పూసల సత్యనారాయణ  శ్రీరంగం సత్యనారాయణ... కావ్య సుధ...తాటిపాముల రమేష్  అద్దంకి లక్ష్మీ  భారత లక్ష్మీ ముంబై లకు ప్రత్యేకమైన ధన్యవాదాలంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

 

0/Post a Comment/Comments