పిచ్చుకమ్మ-గద్వాల సోమన్న

పిచ్చుకమ్మ-గద్వాల సోమన్న

"పిచ్చుకమ్మ"
(బాలగేయం)
-------------------
పచ్చని చెట్టుపై
పిచ్చుక వాలింది
అందాలు రువ్వుతూ
అందరికి నచ్చింది

పుల్లలను తెచ్చింది
గూడొకటి కట్టింది
గుడ్లు అందు పెట్టి
పిల్లలను లేపింది

అంతటా తిరిగింది
ఆహారం తెచ్చింది
ప్రేమతో పిచ్చుక
పిల్లలకు పెట్టింది

మెళుకువలు చెప్పింది
జీవింప నేర్పింది
తల్లి బాధ్యత నెరిగి
పిల్లలను పెంచింది

-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments