తేదీ 18_01_22
గజల్ --- సంక్రాంతి పండుగ
తెలుగుదనము ఉట్టి పడుతు సంబరాలు అంబరాన
శుభములీయ సంకురాత్రి పండగంటె నా కిష్టము
ముంగిళ్లలొ రంగవల్లి మురిపములా చుక్కలెన్నొ
మగువలంత ముగ్గులేయ చూస్తుంటే నా కిష్టము
భోగినాడు తొలి జామున ఆవుపేడ పిడకలతో
భోగిమంట నింగికెగురు తాకుతుంటే నా కిష్టము
అన్నదాత శ్రమలుదీరి ధాన్యలక్ష్మి సిరులు దెచ్చె
పల్లె ప్రజలు సందడిగా తిరుగుతుంటె నాకిష్టము
వేకువనే హరిదాసులు హరినామము భక్తితోడ
నిలచినారు ఇంటి ముందు పాడుతుంటె నాకిష్టము
రంగు రంగు బొమ్మలన్ని కొలువుదీర్చి అందముగా
మగువలంత తాంబూలము యిచ్చుకుంటె నాకిష్టము
నీలి నీలి ఆకాశాన ఎగిరిఎగిరి పడుతు లేచి
గాలిపటము జోరు గాను ఆడుతుంటె నాకిష్టము
పేరు అద్దంకి లక్ష్మి
ఊరు ముంబై