Poem

Poem

శీర్షిక  ప్రకృతి కి తల వంచాలి           Dr. kandepi Raniprasad  ప్రకృతి లో ఒక చిన్న కణం మనిషి ప్రకృతి లో ఒక బుల్లి జీవం మనిషి ప్రకృతి లోఒక చిన్ని ప్రాణం మనిషి ప్రకృతి లో ఒక బుజ్జి జవం మనిషి  అన్నీ తెలుసు అనుకునే మనిషి అన్నీ కనుక్కున్నారు అనే మనిషి అంతా నా ప్రతాపమే అనే మనిషి అంతా నాకే తెలుసు అనే మనిషి  ప్రకృతి పై పెత్తనం చెలాయించే మనిషి ప్రకృతి నీ అదుపు లో పెట్టాలనే మనిషి ప్రకృతి నీ చెప్పు చేతల్లో ఉంచుకునే మనిషి ప్రకృతి నీ అణగ దొక్కాలనుకునే మనిషి  మరి ప్రకృతి పగబడితే మనిషి లేకుండా పోతాడు కరోనా లాంటి వైరస్ లు విజృoభిస్తాయి సునామీ లాంటి తుఫాన్లు ఉవ్వెత్తున ఎగుస్తాయి ఉత్తారా ఖంద్ వరదల్లా ముంచెత్తు తాయి.  ప్రకృతి నీ అనుసరించి నడవాలి సకల జీవరాశులు నీ బతక నివ్వాలి ప్రకృతి లో మమేకమై జీవించాలి ప్రకృతి కి తల వంచి బతకాలి  పేరు Dr kandepi Raniprasad వూరు సిరిసిల్ల చర వాణి 9866160378

0/Post a Comment/Comments