పేరు లేని పరమాత్మ . (సంక్షిప్త వ్యాసం) గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పేరు లేని పరమాత్మ . (సంక్షిప్త వ్యాసం) గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పేరులేని పరమాత్మ ఎవరు? ఆ దైవానికి విభిన్న నామములు ఎలా వచ్చాయి? మీకు తెలుసా!
--------------₹₹₹₹₹₹₹------------------
నిర్వికారుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మకు యదార్ధంగా ఓ ప్రత్యేకమైన నా పేరు లేదు. పేరు ఉన్న వ్యక్తిని ఆ పేరుతో పిలుస్తారు. కానీ పేరులేని వ్యక్తిని ఎన్నో పేర్లతో పిలవడం సహజం. అదేవిధంగా గా పేరులేని పరమాత్మకు కాలప్రవాహంలో ఎందరో మహితాత్ములు, సిద్ధ గురువులు, అవతార పురుషులు, మహర్షులు విభిన్న నామకరణాలు చేశారు. దేవాది దేవుడైన ఆ శివుడే వారి దృష్టిలో పరమాత్ముడు.
          ఆ శివుడిని రుద్రుడని, ఈశ్వరుడని, మహేశ్వరుడని, వేద ఋషులు తెలిపారు.
బ్రహ్మ, బ్రహ్మం, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మయని ఉపనిషత్త్ ఋషులు విశదీకరించారు.
        పరమాత్మ యైన శివుడికి విశ్వములో ఉన్న వివిధ మతస్తులు విభిన్న నామకరణము లు చేశారు.
పరమశివుడు అని. ......... శైవులు.
హరుడని................. గురునానక్.
ఆది పరాశక్తి అని..... శాక్తేయులు.
ఆదినారాయణ........ వైష్ణవులు.
అల్లా అని.......... ముస్లింలు.
పరలోకపు తండ్రి..... క్రిస్టియన్లు
శూన్యమని.......... బౌద్ధులు.
మోక్షమని.  .......... జైనులు.
అహురా మజ్.దాయని..... జొరాస్ట్రియన్లు.
జహోవాయని........ యూదులు.
పకీర్ అని.......... శిరిడి సాయి
ఎరుకయని........ రమణ మహర్షి
కూటస్థమని....... లహరి  మహాశయులు.
స్థితప్రజ్ఞయని......... శ్రీకృష్ణుడు.
ఈశ్వర రాజ్యమని..... జిడ్డు కృష్ణమూర్తి.
నిర్వికల్ప సమాధి అని..... పతంజలి మహర్షి.
ఇలా నామకరణాలు చేసినది ఒక్క శివుడికే. అందుకే అశ్వలాయనుడు
,, సర్వాణీహ వా ఏ తస్య నామధేయాని"తెలిపారు. కాల ప్రవాహంలో పేర్లు మారాయేగాని ఆ దైవం మాత్రం మారలేదు. పేర్లు మేఘాల వంటివి. శివుడు ఆకాశం లాంటి వాడు. మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి. కానీ  ఆకాశంలో మార్పు ఉండదు. అదేవిధంగా దేశకాల పరిస్థితుల్లో శివుడికి విభిన్న రకాలుగా నామకరణం చేశారు. సర్వనామాలు శివునికి సంబంధించినవే. ఈ రహస్యాన్ని హరివంశంలో శంకర భగవానుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు.
నామాని తన గోవింద యానిలోకే మహాంతి చ!
తాన్యేవ మమనామాని నాత్ర కార్యా విచారణా!!
శ్రీకృష్ణ! వేదము నందును, లోకమునందును ఏ నామాలు శ్రేష్టమని భావిస్తున్నామో, ఆ నామాలు అన్ని నా నామములే అని తెలుసుకో. ఈ విషయంలో సంశయం లేదు అని తెలిపెను.
కూర్మపురాణం కూడా ఈశ్వరుడు, హరి, హరుడు, నారాయణుడు, ఈశానుడు, భగవంతుడు శివుడు, విభువు, మొదలగు శబ్దాలు అన్ని శివుడికే అని తెలిపింది.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments