వీణా వాణి

వీణా వాణి

వీణా వాణి

వీణా వాణి
సంగీత లాలిత
సాహితీ అక్షర
అక్షయ మాలిక
రసామృత నెమీలిక
పలుకుల చిలుక
అమ్మా నీవు
హస హంసవై 
నా మదికి చేరాలని...
అమ్మా నీవు
రస ధారవై 
నా స్వరమున స్థిరావాసిగా ఉండాలని...
అమ్మా నీవు
జ్ఞాన ధారివై
నా మేధస్సున కాంతిధారలా నిలవాలని...
అమ్మా నీవు 
అక్షర కానుకై 
నా భావ అక్షయఅంబుధిన కొలువుండాలని
నిను నమ్మి ...జీవిస్తున్నా
నీవు చూపిన సత్యపధమున నడుస్తున్నా
అమ్మా ... నీకోసమే తపిస్తున్నా
వసంత పంచమిన
నిను ప్రార్దిస్తున్నా

రచన
డా!! బాలాజీ దీక్షితులు పి.వి
శ్వేత శిక్షణా సంస్థ
తిరుపతి
8885391722

0/Post a Comment/Comments