మాతృభాషా దినోత్సవం
అంశం మాతృభాష
అంశం మాతృభాష
పేరు అద్దంకి లక్ష్మీ
ఊరు ముంబై
ప్రక్రియ వచన కవిత
ఊరు ముంబై
ప్రక్రియ వచన కవిత
తేదీ 21_2_22
శీర్షిక మాతృభాష పరిరక్షణ
శీర్షిక మాతృభాష పరిరక్షణ
తెలుగు భాష గొప్పదనం తెలుసుకోరా తెలుగోడా
పరుల భాష వెనక పడకు బ్రష్టు చేసే తెలుగు పదము
అమ్మ భాష పలుకు నోట అమృతమే ఒలుకు నటుల
మధురమైన మాతృభాష
మనసుకెంతో హాయి నిచ్చు
నన్నయ్య ఆదికవిగా మొదలైన
నాణ్యమైన భాష ఇది
ప్రబంధ కావ్యాలకు పట్టుకొమ్మ తెలుగు భాష
ముత్యాలముగ్గు వలె మురిపించే అక్షర లిపి
పోతన శ్రీనాధుడు పొందుపరిచే అందాలు
గిడుగువారి వ్యవహారిక గొడుగు పట్టి కాపాడిన మధుర భాష
తెలుగు వారి సంస్కృతిని వెలుగునిచ్చే భాష ఇది
నవరసాల భావాలతో నాట్యమాడించూ
అచ్చ తెలుగు పదాలతో అందమైన నడకలతో అలతి అలతి సొంపులతో అలరించే భావాలు
భాషా ప్రయోగాలెన్నో సాహితీకారులు చక్కగా మలిచారు
భావ ప్రసార సాధనము మనసుకు తోడ్పడు వికాసము
ఎవరి మాతృభాషను వారు కాపాడుకోవాలి
భావితరాలకు మనము అందించే గొప్ప వారసత్వ సంపద.
మాతృభాష పరిరక్షణ ప్రతి పౌరుని కర్తవ్యము
తెలుగు భాష విలువ తెలుసుకోరా
తెలుగులో మాట్లాడి మసలుకోరా
అన్యభాషలు వెంట పడకురా
అమ్మ భాష మనకు కమ్మనైన విందురా
హామీ
ఈ కవిత నా స్వంతం దేనికీ అనువాదం అనుకరణ కాదు

Post a Comment