.
*రథ సప్తమి*
య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.
మా + అఘము = పాపం లేనిది. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని (మాఘము) మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణం తో ప్రారంభమైనా, ఈ రధసప్తమి నుండి ఉత్తరాయణస్పూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షినాయణం నుండి సూర్యుడు విముక్తుడై ఈ రధసప్తమి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. పితృతర్పణాలు, దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిధులకన్న మాఘ మాసమాసమందలి సప్తమి భాగా విశిష్టమైనది. మాఘ శుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రధారూడుడై ప్రపంచానికి దర్సనమివ్వడంతో రధసప్తమిగా వేడుకలను జరుపుకుంటాం. రధంలోని భాగాలు సమయాన్ని, ఋతువులను పేర్కొంటాయి. ఉత్తర దిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్తానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్సనమిస్తాడు.
ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, ఆర్గ్య ప్రధాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. వైవస్వత మన్వంతరంలో మొదటి తిధి రధసప్తమి. ఈ పర్వదినాన జుల్లేదు, రేగు, చిక్కుడు ఆకులను తలపై ఉంచి అభ్యంగన స్నానం చేయిస్తారు. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రభోధము. జిల్లడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమె కాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి..
ఆరోగ్యంభాస్కరాదిచ్చేత్.ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి అట్టి సూర్యుణ్ణి కొలిస్తే మనలో ఉన్న సర్వ రోగాలు ఉపశమిస్తాయి.
ఉమశేషారావు పంతులు
లింగా పూర్
కామారెడ్డి