శీర్షిక: అనుబంధం
ఎదో అనుకున్న
పెళ్ళంటే పేరుకేనని
అదో నిత్యవైరుద్య భావోద్వేగమని
సాగరాన్ని ఈదడమేనని
బిన్న మనస్తత్వాలొక్కటై చేసే యుద్దమేనని
అశాంతి గీతాలాపనేనని
కానీ కాలం గడిచేకొద్ది
చేరాల్సిన తీరానికి దారిచూపే చుక్కానేనని
ఎడారిబతుకులో అదో ఓయసిస్సేనని
లక్ష్యఛేదనలో ప్రేరణై కడవరకది తోడునీడేనని
జీవనగమనంలో పరిస్థితేదెదురైనా గట్టిధైర్యమదేనని
త్యాగాలకు వెరవక జయాపజయాలను సమంగా పంచుకుని ప్రణాళికాబద్ధంగా
పయనించే ఆనందతీరం
నేనెపుడు తానైయుండాలని
అజారామరమైన ప్రేమకు వారధదని
నిరుత్సాహదారుల్లో చైతన్యగీతమదేనని
కాలమెంతమారినా
తరగిపోని ఆప్యాయత
తిరుగులేని ఉత్సాహం
చుట్టూ అల్లుకున్న స్నేహబంధం
జన్మజన్మల అనుబంధం
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.