పిండిమర పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పిండిమర పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పిండిమర పిల్లలం (బాల గేయం)
-------------&&&&&-------------------
పిండిమర నడిపేటి పిల్లలంమేం
వండివార్చేటి మొండి మల్లెలం
రుచికరమైన వంటలెన్నో చేస్తాం
అభిరుచితో కలసిమేం పనిచేస్తాం!

మా పిండిమర  రిపేరు నేర్చుకున్నం
వండి వార్చు తీరును కూర్చుకున్నం
రకరకాల వంటలన్ని వండుతున్నం
అరమరికలేకుండా  నిండుగున్నం

విచ్చేసిన కస్టమర్ల మేం ఆహ్వానిస్తం
అచ్చేసిన మెనూ చేతికి  అందిస్తం
ఇచ్చిన ఆర్డర్.ను ఫాలో ఔతుంటం
మెచ్చి ఇచ్చినటిప్పు పుచ్చుకుంటూ

మార్కెట్లో మేమంటే అందరికీ ప్రేమ
వారిక్కట్లో పడకుండా చేస్తాం శ్రమ
నొప్పించే తత్వం మాది కానేకాదు
ఒప్పించే మనస్తత్వం మాలో పోదు

ఒకచేత్తో మేం వడ్డిస్తూనే ఉంటం
మరోచేత్తో పిండి విసురు తుంటం
నల్ల విడిచి సాము చేస్తూనేఉంటం
యాలపాలలేకుండా పనిచేస్తుంటం

అంతా మమ్ముల మెచ్చుకుంటరు
పొందుగా కానుకలు ఇచ్చుకుంటరు
మార్కెట్లో మాపేరు మారు మోగుతుంది
ఆర్కెస్ట్రాతో ఊరంతా ఉర్రూతలూగుతుంది!

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments