పసితనం పిల్లలు . (బాల గేయం). గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. నెం సెల్ నెంబర్.9491387977.

పసితనం పిల్లలు . (బాల గేయం). గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. నెం సెల్ నెంబర్.9491387977.

పసితనం పిల్లలు (బాల గేయం)
------+-----
పసితనం పిల్లలు
పసిడి వర్ణం మల్లెలు
మెరిసేటి తారలు
కురిసేటి తారలు !
పసితనం ఉన్న పిల్లలు
వసువారని తెల్లమల్లెలు
ఎగిరేటి వినోద విహంగాలు
మెరిసేటి తీరం తరంగాలు!
పసితనం పసి పిల్లలు
మెరిసేటి మిణుగురులు
విరిసేటి  హిమ గిరులు
మురిసేటి తరువులు !
పసితనం పిల్లలు
పసిడి వనం మల్లెలు
చిట్టి పొట్టి చిరుతలు
గట్టిముట్టి బుడతలు !
ఎగిరేటి విహంగాలు
మెరిసేటి తరంగాలు
పచ్చని గడ్డిపరకలు
వెచ్చని మీగడ తరకలు !;
కురిసేటి విరిజల్లు లు
మెడిసిటి హరివిల్లులు
కల్ల లెరుగని కూనలు
చల్లని వెన్నెల సోనలు !
పడిలేచే తరంగాలు
సడిచేసే కు రంగాలు
కసిగలిగిన శివంగులు
సాహసం  సారంగులు !
పసితనం పిల్లలు 
వసివారని మొల్లలు
ఎగిరేటి చిట్టి చిలకలు
పెరిగేటి పెరటి మొలకలు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా
x

0/Post a Comment/Comments