శీర్షిక వృద్ధుల జీవనం అగ్ని పరీక్ష
మానవ జీవన మనుగడ కోసం ఎందుకు ఈ పరీక్ష?
నవమాసాలు మోసిన కన్న తల్లి దండ్రులకు ఏమిటి పరీక్ష?
తాము వృద్ధాశ్రమాల పాలు అవుతామని..
బతుకు పోరాటంలో అనుక్షణం నిరీక్షణం
తమకు ఎందుకు ఈ పరీక్ష అనుకుంటూ
మనోవేదనతో..భగవద్సాన్నిధ్యం
ఎప్పుడు చేరుతామని పరీక్ష?
తాము కన్నవారికి పెంపకంలో ఏమైనా లోటు
చేశామా అని అంతర్మధన ఆవేదన పరీక్ష?
తమను వృద్ధాశ్రమాల్లో చేరిస్తే
వృద్ధ విగత జీవులకు జీవనానికి అగ్నిపరీక్ష?
తమ ప్రేమానురాగాలే ఆస్తిగా భావించి
తమ పిల్లల భవిష్యత్తుకై.. త్యాగ జీవులైన
వృద్ధ దంపతులు.. అందరూ ఉండి
అనాధలుగా మాకు ఎందుకు ఈ పరీక్ష
ఏ కాకులమాయ్యామని.. ప్రేగు బంధాన్ని
తెంచుకోలేక .. యావదాస్తిని అంటగట్టిన అప్పటికీ
అవసాన దశలో మాసాల వారీగా
వాటాలపెరుతో.. వయోవృద్ధుల జీవన హక్కుకు
ఎందుకు పరీక్ష? దూరమయ్యే
ఆనంద పటాపంచలకు జవాబు దొరకని ప్రశ్న?
కన్న తల్లిదండ్రులను వృద్ద అనాధాశ్రమంలో చేర్పించే
మీరు ఒక నాడు అనాధలుగా ఆశ్రమాల్లో చేరక తప్పదనే సత్యాగ్రహాన్ని కనువిప్పుతో
జాగరూకతలు కండి లేదంటే
మీకు తప్పదు ఈ పరీక్ష
ఇప్పటికైనా
ఓ మానవాధములారా వృద్ధ తల్లిదండ్రులను వారి జీవన మనుగడకు కన్న రుణం తీర్చుకోండి.. మీ పిల్లలకు ఆదర్శంగా నిలవండి
రచన ఇమ్మడి రాంబాబు తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు
చరవాణి 9866660531