నా ప్రణయ గీతమా..!!

నా ప్రణయ గీతమా..!!

నా ప్రణయ గీతమా..!!

నాపై మంత్రవాదిలా సమ్మోహనం చేసి
నీ పై చూపులు ప్రసరింప చేస్తివి
ప్రశాంతమైన మనసులో ప్రేమ రాయిని విసిరి
అల్లకల్లోలం చేసినావే నా దివ్య సుందరి..

నినుచూడక  మనసు నిలవడం లేదు
దరిచేరవె నా హృదయ మనోహరీ
విరహంతో  చంపకుండ విచ్చేయవా
ననుచేరవె నా ఊహల సుందరి...

నీకొరకే కళ్ళు నిరంతరం వేచిచూచె 
మదినడగవె ఒకసారి నా ప్రియతమా
ప్రేమతోడ అనురాగం వెల్లువై పొంగే
అందించవె  అధరామృత పానము....

నీతలపుల నా జీవిత మలుపులు
పయనించే పరిమళాలు వెదజల్లుతూ
పూలబాట వేసితిని స్వర్గ సుఖాలు కోసం
నడచిరావె  నవయవ్వన సుందరాంగి...

అనుబంధం పెనవేసెనె అపురూపమై
మనమదిలో వసంతంలే చిగురులు వేసే
ప్రేమకెపుడు అడ్డులే ఎడబాటు సమయం
తెలుసుకోవె నవ వసంతాల పద్మాక్షి...

ననువీడకె కలలోనైనా మధుర భాషిణి
నాప్రాణమె నీ హృదయములో బంధించి
లలితమైన ప్రణయ గీతాలు వినిపిస్తూ
మత్తెక్కించి మనసును దోచుకుంటున్నావు...

పలకాలని ఉంది నీతో మధుర వాక్కులు
తెలపాలని మనసు పలికే మౌనగీతం
వినిపించాలని అల్లుకున్న ఆమని గీతాలు
కనిపించాలని కళ్ళముందు నీకు ప్రేమ జ్యోతి...

కొప్పుల ప్రసాదు 
నంద్యాల
9885066235

0/Post a Comment/Comments