శ్రీమతే బహుమతి ---డా. రామక కృష్ణమూర్తి

శ్రీమతే బహుమతి ---డా. రామక కృష్ణమూర్తి

 శ్రీమతే బహుమతి
        ---డా. రామక కృష్ణమూర్తి
            బోయినపల్లి, మేడ్చల్.



శ్రీమతివై సుమతివై
ధీమతివై నీవుండ
పయనమ్మది సాగును కాదె
సుఖసంతోష సమ్మిశ్రమై
అడుగడుగున నీవు జేర
వడివడిగను కాలము సాగ
సంతృప్తి తోడ నడుచు
జీవనమ్మది యుగాది కాదగున్
ప్రియురాలే సహచరియైన
సంసారమే వసంతమై నిల్చు
కలలు నిజమై కన్పించను
జగమంతా మురిసి మెరువ
సతి నుతి కలుపగాను
పతి మతియుతమై
గతి తప్పక నిలుచును
యతి కాదె ఆలి నిక్కముగను
ప్రేయసి మానసియై కలువ
ప్రోత్సాహమే పాదుగొల్పి
ప్రోదిచేయ పత్ని యగున్
ప్రాపంచిక చిత్రమిదియె కనుమా
ఇంటి పేరు విడిచి
మంటి వరకు నడుచును
కంటికి రెప్పయై కాచి
మింటికెగసిన కీర్తి బడయ
కాపురమే లోకము తనకు
కాచుట నైజము 
కనిపించదు స్వార్థము
కాటికి వెళ్ళు వరకు
ప్రేమను పంచెడి కల్పవృక్షమై
ఆప్యాయతకు కామధేనువై
సేవకు ప్రతిరూపమై
వెలుగు ఇంటి దీపము
సౌభాగ్యమే సంపదగ 
సాన్నిహిత్యమే వరముగ
నిచ్చెడి సహనశీలత్వానికి
సాటిలేరు సతులకెవ్వరు
పిల్లల బాగుకోరి
మగని మనసెరిగి
బంధువుల భాగ్యమై
కలిసి నిలిచె పెండ్లాము
భార్య భరించునదై
తాళి తన బంధమై
ఇల్లే నాకము జేయ
ఇల్లాలు నిల్చె దేవతయై తానున్న చాలు కళకళ
లేకున్న గాదె వెలవెల
పండుగే తానై గలగల
వేయేల! తానొక మిలమిల
గుడి కట్టగ నక్కరలేదు
మడితో పూజలక్కరలేదు
కావడిలో మోయగనక్కరలేదు
ప్రేమ చూపిన చాలు తనపై
గడప ఆవలనున్న గంగ
గృహముననున్న‌ సీత
సదనాన నిలిచిన‌ పద్మ
ఆకలిదీర్చు అన్నపూర్ణ
స్వేచ్ఛను హరించగరాదు
ఆర్థిక దోపిడి చేయగరాదు
సమానమగు మానమునిచ్చి
గౌరవమివ్వదగును సాధ్వికి
లక్షణమేదైనను లక్షణముగ
గుణమేదైనను గుణింపక
కావగవలయును వైఫును
ప్రమాణములే ప్రామాణికముగన్
పాపిట బొట్టును పెట్టి
తన‌ అడుగులో అడుగు వేసి
భద్రముగ చేయిబట్టి
జతగావగ వలయునెప్పటికి
---డా. రామక కృష్ణమూర్తి
    


0/Post a Comment/Comments