సాహిత్యం పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

సాహిత్యం పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

సాహిత్యం పిల్లలం (బాల గేయం)
--------------&&&&&&----------------
సంగీతం నేర్చుకున్న చిన్న  పిల్లలం
సాహిత్యం కూర్చుకున్న మల్లెలం
రాగాల సరాగాల్లో మేం పయనిస్తాం
హాసాల విలాసాల్లో మేంశయనిస్తాం

సాహిత్యానికి వేశాం మేం పునాది
సంగీతానికి తపిస్తుంది మా మది
ఆది అంతం అందులోన చూస్తాం
ఏది వదలక పంతంతో పని చేస్తాం!

సప్తస్వరాల సాధన చేస్తాం
గుప్తనిధుల శోధన చూస్తాం
ఆప్త మిత్రుల వాకబ్ చేస్తాం
నిక్షిప్త నిధులను సంపాదిస్తాం!

కాంభోజరాగం ఆంటీ మాకిష్టం
కళ్యాణ రాగం అంటే కొంచెం కష్టం
అయినా సాధన చేసి సాధిస్తాం
ఏమైనా మరో చరిత్ర సృష్టిస్తాం !

నాగరికతను తెలుపు సాహిత్యం
నానా వ్యాధులకు ఔషధం సంగీతం
సంగీతం సాహిత్యం రెండూ కలిస్తే
మానవజాతికి మేలికమస్తే నమస్తే!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments