చంద్రవంశం పిల్లలం . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

చంద్రవంశం పిల్లలం . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

చంద్రవంశం పిల్లలం (బాల గేయం)
-------------&&&&&-------------------
మా మక్కువైనచంద్రవంశం పిల్లలం
మేం చక్కనైన ఇంద్రనీలం మల్లెలం
అసుర సూర్య భానునేత్ర వారలం
అనురాగాల ఆర్య పుత్ర పోరలం!

మాఇంటి దేవుడు పరంధాముడు
మా కంటి వెలుగు బాల భానుడు
వారి కోటి వెలుగుల గృహం మాది
ఇంతకన్నా మిన్నయైన స్వర్గమేది ?

చందమామ మాకు మేనమామ
అందించేనుగా మాకు స్వర్గసీమ
చక్కని చుక్కల లోకం చూపించే
గ్రక్కున మా ఇంటి దేవుడై దీపించే!

పాలపుంత దారుల్లో విహరించాం
అందరితో  స్నేహాన్ని ఆరంభించాం
చంద్రశాలవెన్నెలనుమేం దర్శించాం
ఇంద్రనీలమణులను సందర్శించాం

మేఘమాల గర్జనలను మేం విన్నం
మా ప్రాణాలకు హాని లేదనుకున్నం
కలసి మెలసి వారితోనే ఉంటున్నం
అలసిసొలసి కలలుమేంకంటున్నం

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments