చిత్రాల పిల్లలం (బాల గేయం).
----------&&&&&-------------------
చిత్రాలు గీసేటి చిన్న పిల్లలం
పత్రాలు రాసేటి పిన్న మల్లెలం
చలనచిత్రాలు చూస్తున్న వారలం
విచిత్రాలతో మురిపిస్తున్నపోరలం
వర్కర్స్తతో మేం పని చేపిస్తం
సర్కస్ ఫీట్లను కూడా చేస్తాం
మస్తు ప్రదర్శనలు ఇస్తుంటాం
పస్తులు లేకుండా మేముంటాం!
మూటలు ముల్లెల మోస్తుంటం
డబ్బూ దస్కంనూ చూస్తుంటం
అవసరమైన సరుకుల కొంటుంటం
ఆనందంగా వండుకొని తింటుంటం
రాత్రి పగలు అన్న భేదం లేదు
పని పాటలు లభిస్తే అదే మేలు
అనుకొని కలిసి మేం పని చేస్తాం
కనుగొనే దారిలో మేం నిలుస్తాం !
గురువంటే భయం భక్తి మాకుంది
చదువుకు శక్తి ఆసక్తి మస్తుగుంది
గురు ముఖ వేదాలలో మేం బంధి
చతుర్ముఖ వాదాలతోనే ఇబ్బంది!
సర్కారు కొలువులకై చూస్తున్నాం
తర్కం మీమాంసం చదువుకున్నాం
అదృష్టంతో ఉద్యోగం మాకు లభిస్తే
మాబతుకులో మెతుకు మాకుమస్తే
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
Post a Comment