శీర్షిక: భవిత లీకేజీ
బావిపౌరుల జీవితాలతో చెలగాటం
దేశాన్నుద్దరించే నాయకులే నాయకత్వం
ప్రతిభ నేడు
దొంగచాటు బేరమైంది
తల్లిదండ్రుల రక్తానికి రుచిమరిగిన
మేకవన్నెపులులు
విద్యనొక వ్యాపారంజేసి
కార్పోరేట్ జలగలు
తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తుంటే
అప్పుల ఊబిలో జీవితాలు
పిల్లల ప్రతిభకు మార్కులే కొలమానంజేస్తూ
వత్తిడిని బర్రనిండా నింపుతూ
పుస్తకాల పురుగులై యాంత్రికతను అద్దుకుంటున్న వైనమే
జీవితమంటే లక్ష్యంవైపూ స్వేచ్ఛగా సాగిపోవడమే
రెక్కలు విరిచి ఎగిరే గమనంనేడు
ఏంతెలియని పయనం
ర్యాంకులతో ప్లెక్సీ ల మేకప్పు
బడా కార్పొరేట్ విద్యా సంస్థల
ప్రచార ఆర్భాటంలో
సమిధౌతున్న బాల్యం
లీకువీరుల విద్యాసంస్థల్లో
మొదటిస్థానం అలంకరించే
నిజమైన గ్రీకు వీరులెవరో
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.