నాడు, నేడు-కుటుంబాలు

నాడు, నేడు-కుటుంబాలు


నాడు, నేడు-కుటుంబాలు

అనుబంధాలకు పుట్టిల్లు
అనురాగాలకు విరిజల్లు
ఆప్యాయతలకు పుట్టిల్లు
ఆపదంటే ఆదుకునే మనస్తత్వాలు
నిరాడంబరతకు సాక్ష్యాలు!

కలిమిలోనైనా, లేమిలోనైనా..
చేదోడు వాదోడుగా ఉండే హృదయాలు
అంతా..మనమంతా ఒక్కటే,
అనే..ఆనాటి మన కుటుంబాలు..!


కానీ, నేడు..
ఆడంబరాలు అధికమయ్యాయి
అనుబంధాలు బందీ అయ్యాయి
అనురాగాలు మసి బారాయి
ఆప్యాయతలు ఆవిరయ్యాయి...

ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా
అయిన వాళ్లనెవ్వరిని పట్టించుకోరు
ఆపదలో ఉన్నామన్నా పట్టించుకోరు.

ఆదుకునే తత్వం లేని వారు
సంపదల వేటలో..
డాంబికాలమోజులో
ఉచ్చ నీచాలు మారుస్తున్నారు
ధనం వెనుక పరుగెడుతున్నారు..
మనమధ్య బంధాలు ఉన్నాయని మరిచిపోయారు!

నేటికి ఎంతో తేడా..
ఇది కొనసాగుతూనే ఉంది..
నేటికీ ఈ వేళ!!


ఎన్.రాజేష్-ఎమ్మెస్సీ
కవి,జర్నలిస్ట్-హైదరాబాద్.

0/Post a Comment/Comments