మహాకవి ' డా.సినారె '
(సినారె వర్ధంతి జూన్ 12)
----------------------------------------
పుట్టె సినారె నాడు
వారు గిట్టిరి నేడు
కవన వనమున ఱేడు
ఓ వెన్నెలమ్మ
తెచ్చె తెలుగుకు కీర్తి
ఇచ్చె కవులకు స్ఫూర్తి
ఇల ఆదర్శ మూర్తి
ఓ వెన్నెలమ్మ
తీపి సినారె పాట
పరిమళించే తోట
తెలుగు పదముల మూట
ఓ వెన్నెలమ్మ
తెలుగు వారికి ఘనత
క్రొత్త కవులకు భవిత
ఘనము సినారె చరిత
ఓ వెన్నెలమ్మ
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.