గుర్రాల. 9491387977.
సుభాషితములు!
-------------------------
నీ గొప్పలు నీవు చెప్పుకో వద్దు
ఈ లోకం చెప్పుకుంటేనే ముద్దు
ఆ అలవాటును చేసుకో ఇక రద్దు
అప్పుడు అంతా హర్షించుట కద్దు!
సంశయం ఉన్నవాడు
ఏ పనిని సాధించలేడు
కింద మీద పడి వాడు
తుదకు నశించిపోతాడు!
నీకు వచ్చేంతవరకు
వల్లె వేస్తూనే ఉండు
నీవు చచ్చేంత వరకు
చదువుతూనే ఉండు!
సజ్జనుడు పడినా చెడినా
బంతివలె మరల లేస్తాడు
దుర్జనుడు పడితే చెడితే
మట్టి ముద్దలా మిగుల్తాడు !
మధురమైన వాక్కులు
తొలగించును చిక్కులు
కొని తెచ్చుకో బుక్కులు
చదువుకో ఇక రుక్కులు!
సజ్జన సాంగత్యం
సద్గతి కి సోపానం
తెలుసుకో విషయం
అందు లేదు సంశయం!
వినయము లేని జ్ఞానం
సత్యము లేని వాక్యం
ఇలలో రాణించవని
తెలుసుకో నీవిక విని!
దైవము కన్న మిన్న
కాలమే గదరన్న
తెలుసుకో ఈ సంగతి
పొద్దు నీవు సద్గతి!
కర్తవ్యం ఎంచుకో
సామర్థ్యం పెంచుకో
మిత్రత్వం పంచుకో
శత్రుత్వం వదిలించుకో!
సుఖంలో పొంగి పోవద్దు
దుఃఖంలో కృంగిపోవద్దు
అధర్మానికి లొంగి పోవద్దు
వీటిని పాటిస్తేనే ముద్దు !
అహం దుర్మార్గులకు కిరీటం
సహనం సన్మార్గులకు మకుటం
తెలుసుకొని వదులుకో కపటం
తెలియకుండా ఉంటే సంకటం!
అత్యాశ గల వాడికి
అసలు సంతృప్తి లేదు
సంతృప్తి లేని వాడికి
సంతోషం లేనే లేదు !
గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.