గోలకొండ పిల్లలం.(బాల గీతంం). సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

గోలకొండ పిల్లలం.(బాల గీతంం). సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

గోలకొండ పిల్లలం (బాల గీతం)
-------------&&&&&&----------------
గోలకొండ పిల్లలం
శాలిబండ మల్లెలం 
చుడిదారు వారలం
జోరుదారు పోరలం !

ఉయ్యాలలో ఊగుతాం
సయ్యాటలో జోగుతాం
పాటలెన్నో పాడుతాం
ఆటలెన్నో ఆడుతాం!

మేం నడుపుతాం కారు
అందులోనే మా షికారు
రోజు రోజు మేంచేస్తుంటాం
మా మోజు తీర్చుకుంటాం!

మా నోటికి రాదు అబద్ధం
ఆ మాటే మాకు నిషిద్ధం
అని చెబితే నమ్మరు మీరు
ఇక చెప్పే వరకు ఊరుకోరు!

సూటు బూటు మేం వేసుకుంటాం
నీటుగాను క్యూటుగాను ఉంటాం
అంతట దర్జాగా తిరుగుతుంటాం
మాకు ఎదురులేదని ఇక అంటాం !

రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేయుట మా వ్యవహారం
అది కాదులే మాకు భారం
ఆస్తికి అది సింహద్వారం !

గోలకొండ చరిత్రనూ వివరిస్తాం
పర్యాటకుల మనసును వరిస్తాం
శభాష్ అని వారి చేత అనిపిస్తాం
వెంట ఉండి వారికి చేయూతనిస్తాం

అత్తరు పన్నీరును పూసుకుంటాం
స్నోపౌడర్లను కూడా రాసుకుంటాం
మోడరన్ డ్రెస్సునే  వేసుకుంటాం
అత్తారిల్లే ఇక మా అడ్రస్ అంటాం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments