శీర్షిక: ఆదివాసుల ఆత్మఘోష. పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: ఆదివాసుల ఆత్మఘోష. పేరు: సి.శేఖర్(సియస్సార్)



శీర్షిక:ఆదివాసుల ఆత్మఘోష

పెత్తందార్ల ఆగడాలు
అడవిబిడ్డల అగచాట్లు
వాళ్ళ జీవితాలు 
ఊడిగంజేసి ఉసూరుమనే దీపాలు

ఆక్రమణలు ఆకృత్యాలు
అడ్డగోలు అరాచకత్వం
దౌర్జన్యాలు దౌర్భాగ్యం
ఎదురౌతుంటే
భయంలేదక్కడ బతుకొక్కటే
వచ్చేవాడెవడైతేనేం
తిరగబడడమే కావాలి

కష్టాన్ని మెడలేసుకొని
కాడివరకు సాగే జీవితాలవి
కల్మషమెరుగని అడవిగంధాలు
కానీ
నేడేలుతున్న ఏలికలు మితిమీరినతనంతో అతిచేష్టలు చేస్తుంటే
చేతులుముడుచుకుంటారా?
ఆ చేతులు గండ్రగొడ్డళ్ళు
క్రూరమృగాలమధ్యే జీవనం
భయంలేని నిర్భయత్వం వారిసొంతం

ఓట్ల కోసమైతే ఆదివాసులను
అంధలాలెక్కించే నీచరాజకీయం
కళ్ళెదుట కనిపిస్తుంది
వారిచిరునామా వనవాసమే
అడవితోనే సహవాసం

కాలంచూస్తూ ఆగిపోదు
మనిషి ఉనికిని కోల్పోడు
దొంగచాటుగా దాడులా?
హృదయం గాయపడింది
ఆవేశం గుండెల్లో లావాలా 
పెల్లుబీకిన క్షణమది
ఎంతటోడైనా నిజాయితీకి తలవంచాల్సిందే

అన్యాయంగా ఆక్రమించడానికా అందలమెక్కించింది
అవకాశాలనన్నీ దోచేస్తరు
సందుదొరికితే ఉన్నదంతా ఊడ్చేస్తరు
లేనోడికింకా చోటులేనితనం
నీకున్న అధికారమెవరిచ్చిరి
ఖబడ్దార్
సమీపిస్తున్న కాలమే 
మీ అధికారానికి సమాది కడుతుంది 

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments