శీర్షిక: ఉన్నోడి అంతరంగం
ఉన్నతవర్గాల మనుషుల మనసులు
అణగారిన వర్గాల మనోభావాలను గంభీరంగా దెబ్బిపొడుస్తుంటాయ్
వాన్ననిచిపెట్టాలనే కుటిలత్వాన్ని పైత్యంగ మార్చుకుని
ఓ వికారాన్ని కనుసన్నల్లోనే
ఒలికించే కుటిలవర్తనులు
కులాలకుంపట్లనెపుడు
రాజేసే రాతిమనుషులు
వాళ్ళకెందుకో ఎంత చదివిన
బుద్ది వికసించదు
పెత్తనం చేయడమైతే చేతగాదిపుడు కానీ
మాటలతోనే చిత్రవధ చేస్తున్న
మహాజ్ఞానాన్ని ధరించిన మనువాద ఛాందసవాదులు
సందుదొరికితే చాలు
కులగజ్జిగాళ్ళ కళ్ళు కుల్లుకుంటాయ్
ఓ అడుగు ముందుకేస్తే
ఓర్వలేనితనాన్ని వెకిలి నవ్వుల్తో
ఉద్దరిస్తారనే బావన పైపైకి చూపెడుతూ ఉన్నచోటికే లాగేస్తారు
అడుగేయలేని అగాధంలో ముంచేస్తరు
ఒక్కోసారి వాడు మనిషినన్న సంగతే మరచిపోతాడు
రాజ్యాంగాన్ని చదవనోడు
రాక్షసుడై సాటిమనిషిని పట్టిపీడిస్తున్న వైనం
ఎందుకంత నీచమైన ఆలోచనలో
సమానత్వ సమాజాన్ని స్థాపించాలనే ఊకదంపుడు ఉపన్యాసాలిస్తరు
వాస్తవంలో ఉత్తదేనాయే
మార్పురాని సమాజాన
కోల్పోయిన ప్రాణాలెన్నో
రాక్షసులకంటే క్రూరాతిక్రూరంగా నరికిచంపిన
మనిషిరూపంలోనదాగి కులాన్నెపట్టుకువేలాడే నాగరిక జీవనగమనంలో
న్యాయంజరగదెప్పటికి
ఆకాశదాకా ఎగిరే అవకాశాలెన్నొచ్చినా
వాడి చెప్పుచేతుల్లోనే బతకు
అధికారందలాలెక్కినా
కనుసైగల్లో మెదలాల్సిందే
జ్ఞానమెంత వికసించిన
చీకటితెరలు కమ్ముకునేవుంటయ్
మేధస్సు మాత్రం అవమాన భారాన్నైతె మోయాల్సిందే
అవగాహనెంతొచ్చినా
అక్షరజ్ఞానంమెంత సమకూరిన
వికాసమెంతొచ్చినా
అక్షరాలను సైతం
వాడిని పొగడి మెప్పువొందెందుకేనాయే
పొందిన అవమానాలను మరచి
వాడిచేతిలోనే సన్మానాలందుకునే తాపత్రయం
వెనకబాటుతనమే మనచిరునామా
అంతే....అంతే
మేధావుల జ్ఞానం
ఉన్నోడికే దాసోహం
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.