శీర్షిక: రవీంద్రభారతిలో సన్మానం

శీర్షిక: రవీంద్రభారతిలో సన్మానం

*రవీంద్ర భారతిలో అమడబాకుల ఉపాద్యాయుడికి సన్మానం*

తెలుగు భాషా సాహితీ, సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలుగు భాష అమృతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 23న శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, 29న శ్రీ గిడుగు రామమూర్తి జయంతోత్సవాలు జరుగుతున్నాయి. వారం రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్తకోట మండలం అమడబాకుల జిల్లాపరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు శ్రీ సి. శేఖర్ గారు సేవ సంస్థ ఆహ్వానం మేరకు కవిసమ్మేళనంలో పాల్గొని "గెలుపుశిఖరం" అనే కవితాగానం చేయడం జరిగింది. ఇది అందరి ప్రశంసలు పొందింది. ఈ సంధర్భంగా మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, శ్రీ కంచర్ల సుబ్బానాయుడు, సినీగేయ రచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణ గార్లు శ్రీ సి. శేఖర్ గారిని సన్మానించి, అవార్డు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేసి, అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి ఆచార్య శ్రీ కొలకులూరి ఇనాక్ గారు కూడా పాల్గొన్నారు.

0/Post a Comment/Comments