ముత్యాల హారాల బిడ్డ !
----------&&&&&------------
ముత్యాల హారాలు మిన్న
కావుననే వ్రాస్తున్న
రాథోడ్ శ్రావణ్ అన్న
నేను మీకు తెలుపుతున్న !
మెరిసేటి సోనాపూర్
వీరు పుట్టినట్టి ఊరు
కలివిడిగాను ఉంటారు
ఊరికి తెచ్చిండ్రు పేరు !
ముత్యాల హారాల బిడ్డ
ఉట్నూరే ఆతని అడ్డ
అది ఓ సాహితీ ఉడ్డ
తను ఉద్దరించిన గడ్డ !
మీ ముత్యాల హారాలే
నాకు పేరు తెచ్చెనులే
అను నిజం నే మరువలే
మీ చెలిమిని విడువనులే !
మీరు ఇచ్చిన అవార్డు
నా ఖాతాకు రికార్డు
అని నే పెడతా బోర్డు
అది నాకు శుభం కార్డు !
మీ పుస్తకం పండుగలు
మేటి ముత్యాల హారాలు
మేం చదివే సుస్వరాలు
అవి తెలుగువారి వరాలు !
మీరు ముత్యాల హారాల
వేశారు సంకలనాల
పొందినారు అవార్డుల
సన్మానాల రికార్డుల !
పుస్తకాల సమీక్షలు
వ్రాసిన కవి ఈశ్వరులు
మీరే మా కవి మిత్రులు
సరే అల్లండి హారాలు. !
బంజారా జాతి బత్యం
గిరిజన సాహిత్య ముత్యం
మీరే వారికి అగత్యం
నేనిక చెబుతున్న సత్యం. !
కైతికాలను వ్రాసారు
పత్రికలలో వేసారు
మంచి మాటకారి మీరు
రచనలెన్నో చేసినారు. !
కవిత్వంలో వీరు ధిట్ట
విప్పేరిక కవితల చిట్ట
నవ్వులాపుకోదు పొట్ట
తనది ఉపాయాల పుట్ట !
సాహితీ సేవ సర్దారు
ఎన్నో పట్టాలు పొందారు
సాహిత్యంలో ఇక వీరు
చిరస్థాయిగా ఉంటారు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.