నీచపు దుర్మార్గ నిజాం సైన్యాలు
ప్రజల కుత్తుకల మీద కాలేసి నలుపుతున్న గడీల దొరల పెత్తనాలు ! ప్రజలెక్కడ ? ప్రజలంతా బానిసలే ! వెట్టిచాకిరి కార్మికులే ! కమ్యూనిస్టు సోషలిస్టు కదన వ్యూహాలు వేలాది మంది నెత్తురోడిన సాక్ష్యాలు కదంతొక్కిన జనం ఎగిసి గడీల కూల్చిన తీరు నిజామొక్కడేనా ఈ భూస్వాముల సంగతేంది ? విలీనం కాదు విమోచన కాదు విద్రోహమని నినదించే గొంతుకలు సమైక్యమని సంబురపడే వారు ఎవరైనా చరిత్రని మార్చగలరా ? 74 ఏళ్ళకు కేంద్రానికి 8ఏళ్ళకు రాష్ట్రానికి అట్లెట్లా గుర్తుకొచ్చే మతులబేందో అన్ఫర్ల్ చేస్తే మంచిగుండు తెలంగాణ మీద ఇంత అట్టెట్లా పుట్టిందో ?
ప్రజలు పోరాడిన అప్పటి నైజాములో ప్రజా ఉద్యమాల నేటి తెలంగాణాలో ప్రభుత్వాలు దొరల చేతుల్లోనే ప్రజలు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలే ! ఆత్మ గౌరవ నినాదం ఏమయ్యే అవినీతి గొంతుకలు చీల్చే తెగువ ఏమయ్యే ఓ తెలంగాణ ఆధునిక వెట్టిచాకిరి బానిస కార్మిక అసలు నీవెక్కడ ?
- రాజేంద్ర
9010137504
(17-09-2022 7:30am)