జాతీయ భాషా దినోత్సవంగా హిందీ
ఆరు రాష్ట్రాల ఆధిపత్యానికి ప్రతీక హిందీ దివస్. అని దేశ ప్రజలు పలుసందర్భాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూనే వున్నారు. రాజ్యాంగ పరిషత్ 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయ భాషగా గుర్తించింది. అప్పటినుండి హిందీ భాష ఆధిపత్యాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు తమ వ్యతిరేకతను వినిపిస్తూనే వున్నారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పొందుపర్చిన ఆర్టికల్ 351 ప్రకారంగా హిందీకి రాజ్యాంగ భద్రత కల్పించారు. స్వాతంత్ర్యానంతరం హిందీతో పాటు దేశంలో ఇంగ్లీష్ కూడా అధికార కార్యకలాపాల్లో భాగస్వామ్యమయ్యింది.
భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకునేందుకు ప్రతిభాషకు ఒకరోజు తప్పకుండా ఉండాల్సిందే. ఆరోజున ఆ భాష యొక్క వికాసాన్ని, సాహితీ సేవను, ఆ భాషా ప్రజల జీవన విధానాన్ని, పోరాటపటిమను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది భావితరాలను ఉత్తేజపరుస్తుంది. మార్గనిర్దేశనం చేస్తుంది.
భాషా పరంగా చూసినట్టైతే హిందీ భాష ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది. హిందీ భాష చాలా వరకు సంస్కృతం నుండి గ్రహించింది. సుమారు ఆరువేల పైచిలుకు వుండే భాషలలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా ప్రపంచంలో హిందీకి రెండోస్థానముంది. హిందీ భాష "లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ"గా కొందరిచే పిలువబడుతుంది. హిందీ అంటే పర్షియన్ కానుక అని అర్థం. దీనిని దేవనాగరి లిపిలో రాస్తారు.
త్రిభాషా సూత్రం ఆధారంగా ప్రతీ రాష్ట్రంలో హిందీ భాషను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. 'హిందీ' సమాజంలో ఎక్కువగా వాడుకలో లేకపోవడం మరియు నిత్య వ్యవహారంలో అంతగా ప్రాముఖ్యత లేకపోవడం, విద్యార్థులు భాషను అధ్యయనం చేయడం అడ్డంకిగా మారుతుంది. అదీపోను హిందీని నేర్చుకుంటేనే భవిష్యత్తు అనేది ఏంలేదు గనుక హిందీ భాష యొక్క విస్తృతికి ఆటంకంగా ఉంది. దీనికి తోడు మాతృభాషా ప్రాధాన్యం ఉండనే ఉంది.
హిందీ జాతీయ భాషగా ఉన్నప్పటికీ ఇంగ్లీషుకు ఉన్న పరిధి ఎక్కువని చెప్పొచ్చు. హిందీ జాతీయ భాష అయినప్పటికీ ఉపాధి అవకాశాల దృష్ట్యా ఇంగ్లీష్ భాష అధ్యయనం వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
భారతదేశ భౌగోళిక పరిస్థితులదృష్ట్యా ప్రాంతీయ భాషలకు అధిక ప్రాముఖ్యమున్న తరుణంలో హిందీ అంతగా వాడుకలో లేదనే చెప్పాలి. కానీ హిందీ మాట్లాడే ప్రజల వలస మాత్రం దేశం నలుమూలలా కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బీహార్ మొదలైన రాష్ట్రలలో ఎక్కువ చెలామణిలో ఉన్న హిందీ భాష ఆధిపత్యాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఆత్మగౌరవ నినాదంతో ముడిపెడుతున్నాయి. దానికి చారిత్రక కారణాలు కూడా లేకపోలేదు.
ఇండియా అని ఆంగ్లలో ఉచ్చరించబడే భారతదేశం వందల సంస్థానాల కలయిక వల్ల ఏర్పడ్డ రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో రచించుకున్న రాజ్యాంగం చేత పరిపాలించబడుతున్న అఖండ దేశం. స్వాతంత్ర్యానికి పూర్వం ఖండ ఖండాలుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాల్ని మరియు స్వయం పాలిత ప్రాంతాల్ని ఏకం చేయడం వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కేవలం హిందీ భాష యొక్క ఆధిపత్యాన్ని నిరసించడం వింతగా అనిపించదు. దేశంలో అత్యధిక ప్రచారంలో ఉన్న మరో భాషను జాతీయ భాషగా ప్రకటించేందుకు సాహసం చేయాలంటే జాతీయత అడ్డుగా ఉండొచ్చు. కానీ అదే జాతీయభావం హిందీవల్ల కూడా పరిపూర్ణాంగా పెంపొందడంలేదు.
ఎవరికివారు భారతీయులు కుల, మత, జాతి బేధాలు లేక రాజ్యాంగానికి బద్ధులై మేమంతా బారతీయలం అనే జాతీయభావాన్ని కొనసాగించడం దేశ సమగ్రతకు, ఐక్యతకు నిర్శనం. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలు హిందీని జాతీయ భాషగా అంగీకరిస్తూ… రాజ్యాంగ సవరణ జరిగేదాక జాతీయభాషగా హిందీని దేశప్రజాలంతా గౌరవిస్తూ హిందీ దివస్ ను జరుపుకోవాలి.
- రాజేంద్ర
9010137504