'గుఱ్ఱం జాషువా' స్మారక సాహితీ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక-శ్రీ.ది.ఆర్.బి.ప్రసాద్,గుడివాడ(పల్లెబాట ఎడిటర్)

'గుఱ్ఱం జాషువా' స్మారక సాహితీ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక-శ్రీ.ది.ఆర్.బి.ప్రసాద్,గుడివాడ(పల్లెబాట ఎడిటర్)

'గుఱ్ఱం జాషువా' స్మారక సాహితీ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని  హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న,నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ నెల 28,గుఱ్ఱం జాషువా జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికిచ్చే ఈ అవార్డు బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు  బాలసాహిత్యవేత్త సోమన్న ను వరించిందని 'తెలుగు భాషా వికాస సమితి' సమన్వయకర్త శ్రీ.ది.ఆర్.బి.ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ పురస్కారమును ఈ నెల 28న గుడివాడలో గద్వాల సోమన్న  అందుకొనున్నారు.అవార్డు ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

0/Post a Comment/Comments