'ఉత్తమ ఉపాధ్యాయుని' గా గద్వాల సోమన్నకు సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు 'ఉత్తమ ఉపాధ్యాయుని' గా ఘన సత్కారం లభించింది. "జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా ,అచిర కాలంలోనే దాదాపు 24 పుస్తకాలు వ్రాసి,ముద్రించి తన ప్రతిభను చాటుకున్నారు.గణితో పాధ్యాయుడైనా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో గద్వాల సోమన్న విశేష కృషి చేసినందులకుగాను,విశిష్ట సేవలుగాను వీరి ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ,ఎమ్మిగనూరు శాఖ దుశ్శాలువా కప్పి,మెమొంటో ఇచ్చి గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.