మణిపూసల దీపావళి. సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

మణిపూసల దీపావళి. సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

మణిపూసల దీపావళి
---------&&&&------------
దివ్యమైన దీపావళి
అందమైన శోభావళి
వస్తున్నది మస్తున్నది
తెలుగు వెలుగు రూపవళి !

తెలుగుదనం పట్టుకొని
కాలాన్ని నెట్టుకొని
వస్తున్నది దీపావళి
శుభం బొట్టు పెట్టుకొని !

ప్రమిదల వెలుగులతో
ప్రభల వెలుగులతో
మెరిసిపోవు దీపావళి
జనులందరి నవ్వులతో

తను టపాసులు కాలుస్తూ
చిచ్చుబుడ్లను వెలిగిస్తూ
చిందేస్తూ వస్తున్నది
కానుకల మోసుకొస్తూ  !

మన దీపావళి వచ్చే
మది ఎంతో ఇక మెచ్చే
ఆహ్వానం పలుకుదాం
కలిమిని ఇక అందిచ్చే. !

వరుస దీపాల పెట్టింది
తోరణాలనూ కట్టింది
దీపావళి వచ్చి మనకు
శ్రీ కారాన్ని చుట్టింది  !

చుక్కలను పెట్టుకుంటు
ముగ్గులను వేసుకుంటు
ముత్తైదువలా వస్తుంది 
దీప కన్య తానంటు.  !

అదృష్ట లక్ష్మీలా తను
మన తెలుగు లోగిలి లోన
నివసించుటకై వస్తుంది
ముప్పొద్దుల ముదముతోను !

ఆనందాల హరివిల్లై
మురిసేటీ వెన్నెల జల్లై
వచ్చెను మన దీపావళి
మన సిరి సంపదల ముల్లై. !

దీపావళి పండుగకు
సుస్వాగతం పలుకుటకు
కలిసి మెలిసి పోదాము
మన పేరును నిలుపుటకు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments