*వేపకాయల బతుకమ్మ*(ఏడవరోజు)శ్రీలతరమేశ్ గోస్కుల.

*వేపకాయల బతుకమ్మ*(ఏడవరోజు)శ్రీలతరమేశ్ గోస్కుల.

రంగు రంగుల పూలు
రాసులుగా పోసి..
వరుసవరుసలుగా
తీరొక్క పూలతో..
నిన్ను ఏడంతరాలు పేర్చి తనివితీరా 
చూస్తుంటే...

తంగేడు గునుగు గుసగుసలాడే..
బంతీ..చామంతులు గులాబీలతో చేరి
సిగ్గు లొలికే...
పూలన్నీ పరవశంతో పులకరించి
పున్నమి వెలుగులవోలే
పుత్తడి వెలుగులీనుతుండె..

ఉయ్యాల పాటలతో
నిన్నెతుకుని మురిసిపోతూ
మైమరచిపోతూ
బతుకు నిచ్చేబతుకమ్మ... బంగారు బతుకమ్మ నీవంటూ.. 
భక్తితో కొలిచేమమ్మా..

పువ్వులనూ పూజించే
పండుగొచ్చేనని ....
ఆడబిడ్డలకై  తోడబుట్టవుల ఆరాటం చూసి
పంట పొలాలు పచ్చగా నవ్వులు రువ్వెను కళకళలాడుతు...

ముద్దులొలికే చిన్నారులతో
ముద్దుగుమ్మలంతా మదావహంగా..
ఏమేమి పువ్యొప్పునే గౌరమ్మా..
ఏమేమి కాయొప్పునే గౌరమ్మా..
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మా..
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మా..అంటూ..
ఆనందనంగా ఆటపాటలతో నిన్ను కొలిచి నిద్ర పుచ్చగా..
బతుమ్మలతో ఏటి గట్లు గలగలలతో మురిసే...

సకినాల పిండితో
చేసిన వేపకాయలను..
ఇంకా.. పప్పు బెల్లాలనూ
నైవేద్యంగా పెట్టి 
ఇస్తినమ్మా వాయనం..
పుచ్చుకుంటినమ్మా వాయనమని..
వాయనాలు అందుకునేరు
అతివలంత ఆనందంగా..

  *శ్రీలతరమేశ్ గోస్కుల*
  *హుజురాబాద్.*


0/Post a Comment/Comments