...........................................................
(౧) లౌక్యము - లోకజ్ఞానము, లౌక్యుడు - లోకవ్యవహరములు తెలిసినవాడు.
(౨) మల్లగుల్లాలు పడుట - వాదులాట.
(౩) ఉత్తుంగతరంగాలు - ఎత్తెయిన పొడవైన అలలు.
(౪ ) అనూచానంగా వస్తోంది - వేదాధ్యము వలన వచ్చినది.
(౫ ) నేనెందుకు ఇచ్చు కోవాలి - ఒకరికి నువ్వు ఇవ్వాల్సిన ధనాన్ని నేనెందుకు ఇవ్వాలి.
(౬ ) ఒంటరి - ఏ సహాయము లేని బంటు. (ఒంట+ అరి - ఒంటరి)
(౭) పరుషము - నిష్టూరము.
(౮ ) సింగినాదము - దుప్పికొమ్ముతో చేయబడిన సుషిర వాద్యము. (గాలి ఊదడము ద్వారా పలికెడిది) వేణువు, నాదస్వరము లాగా .
( ౯) సైకతము - ఇసుక, ఇసుకదిబ్బ.సైకతలింగము - ఇసుకతో చేసిన లింగము.
(౧0) సర్వతోముఖము - అన్ని వైపులా విస్తరించునది - నీరు. నీరు కిందపడితే మొదట అన్ని వైపులకు విస్తరించి అటుపై పల్లము వైపుగా ప్రవహిస్తుంది.
విపంచి - వీణ.
సేకరణ:ఇమ్మడి రాంబాబు
అధ్యక్షుడు:తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మహబూబాబాద్
9866660531