ఆయన మరణించలేదు
పుట్టింది కడు పేదరికం
అవమానాలు పడ్డ
అవహేళనలు ఎదురుకున్న
స్వయం కృషితో వెలిగిన
భానుడు
ప్రపంచంలో సాటిలేని
మేటి రాజ్యాంగం ఇచ్చి
స్వయం కృషితో ఎదిగి
ఊరు చివర పాకాలెందుకు
పేరు చివర మీకు ఆ తోకలేందుకు అంటూ
చూపుడువేలుతో ఎత్తిచూపుతూ
నిగ్గ దీసి ప్రశ్నించిన అగ్నికణం
అంబేద్కర్
స్వాతంత్ర్యంసిద్దించాక
పరిపాలనా సౌలభ్యం కొరకు
ప్రజాస్వామ్య పరిరక్షణేధ్యేయంగా
బడుగు బలహీన వర్గాల ఉన్నతే లక్ష్యంగా
రక్షణ లు ఏర్పరిచి
సమాన్యాయ పాలన
హక్కులు
సంక్షేమ భావన
ప్రవేశిక లోని ప్రతీది
భారతీయ ఆత్మ
అభ్యుదయ భావవ్యక్తీకరణ తో
ప్రపంచంలోనే అత్యద్భుతం గా
రాజ్యాంగమును రచించిన
రాజ్యాంగ పీత మన భీం
ఆయనే దళిత సూరీడై
అణగారినవర్గాల ఆశాజ్యోతియై
దేశానికి విశిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన
రాజ్యాంగ ప్రదాత
బౌద్ధమత ప్రభోదకుడు!
సామాజిక న్యాయానికి
ఉవ్విలూరిన చైతన్యవాది
నేడు సామాన్యుడు రాష్ట్రపతి
ఆయిన,ఒక మైనారిటీ
రాష్ట్రపతి అయిన
దానికి భీం కారణం
ఆయన దళితులు,మైనారిటీలు
బడుగు బలహీన వర్గాలు
కాదు కాదు
సామాజిక చైతన్యాన్ని వాంఛించే గుండెల్లో
కొలువై మరణం బౌతికంగా
ప్రతి భారతీయుని గుండెల్లో
శాశ్వతంగా అగుపించే
ధ్వని
మనిషి మానవత్వం లో
అగుపించే కాంతి
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి