క్రిస్మస్ అక్షర శుభాకాంక్షలు

క్రిస్మస్ అక్షర శుభాకాంక్షలు

క్రిస్మస్ శుభాకాంక్షలతో
నన్ను నడిపించు
నీ మార్గం వెంట
నీ ప్రేమ తత్వం వెంట
క్షేమ గుణం నేర్పు
పచ్చతాప్యనికి మించిన
పరివర్తన లేదు
నీ రక్తం తో శుద్ధి చేసి
మనిషిని పాపాలనుండి
రక్షించి పరివర్తన చేసిన
ప్రభువా ...
ఎన్నో అధ్యాయాల
 అధ్యయనాలు చేశాను
 ఆచరణలో మాత్రం
నా  చరణాలు పడలేదు.
నా పాపాల చిట్టా ను పెంచుకుంటూ
మోకాళ్లు వంచి "అధరం" తో ప్రార్థిస్తున్నా..
నీ "రుధిరం" నన్ను తడుపుతుంది.
తల ఎత్తి చూసాను... 
పేతురు ఒక్కసారే అబద్దం ఆడి
యూదులకు నిన్ను పట్టించాడు
 నా అబద్దాల ప్రార్ధనతో
ప్రతి నిమిషం నిన్ను పట్టిస్తున్నా...
శిలువను నేనే వేసేస్తున్నా...
అవిశ్వాసం నన్ను తరిమి
లోతు భార్య వోలె 
ఉక్కు స్తంభంగా మార్చేసింది .
దేవా...
సైతాను వెంట తరిమినా యోబు వలె
విశ్వాసం వైపు నన్ను  నడిపించు.
వృద్దాప్యంలో సారా,  అబ్రహం కి 
పుత్ర సంతానం ఇచ్చావు.
ద్రాక్ష తీగ వోలె నన్ను చిగురింపజేయి. 
నేహెమ్యా లా నమ్మకంతో ఉంచు..
రూతు వలె నీతిగా ఉంచు.
ఓబద్యా వోలె నిబద్దత తో
పవిత్ర కీర్తనలు పాడుకొనుచు...
మలాకీ వలె చలాకీ గా
పరమ గీతములు ఆలపిస్తూ
న్యాయాదిపతి వై నీ సన్నిధికి
నన్ను నడిపించు...దేవా
ఆమేన్
ప్రేమ,క్షేమ,త్యాగం,మానవతా,హృదయ పరివర్తన పంచ గుణాలే క్రీస్తు కు చేరువ చేస్తాయి
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి

0/Post a Comment/Comments