సుభాషితాలు(బాలగేయం) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

సుభాషితాలు(బాలగేయం) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

సుభాషితాలు
(బాలగేయం)
----------------------------------------
పొత్తు ఇక మంచిదైతే!!
విత్తులా మొలస్తుంది
హత్తుకొని బహు గొప్పగా
వొత్తిలా వెలుగుతుంది

మెత్తని పత్తి రీతిలో
అత్త మనసు ఉంటుంది
ఉత్తములుగా బ్రతుకున
ఎత్తు ఎదుగుమంటుంది

చెత్త పనులు మానుకొని
సత్తా  చాటుమంటుంది
కొత్త కొత్త ఆశలతో
గిత్తలా సాగమంటుంది

నత్త నడక వదులుకొని
ఉత్త మాటలు కట్టిపెట్టి
మొత్తానికి గమ్యాన్ని
కత్తిలా చేరాలంది

-గద్వాల సోమన్న,  
 ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments