వాడిపోనిది స్నేహబంధం

వాడిపోనిది స్నేహబంధం


వాడిపోనిది స్నేహబంధం

ఓ చోట జన్మించి
మరోచోట పెరిగి పెద్దై
ఊహించని చోటులో స్థిరపడి
సంతోష సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు

లక్ష్యం కళ్ళముందేసుకుని
సాదాసీదాగా
సామాన్యుడిలా పెద్దడుగేసావు

భాషే తెలియని ప్రాంతంలో
బాటసారివై
అవసరాలనెన్నిటినో త్యజించి ఆకలికీసైతం పస్తునేర్పించి
పడుకోబెట్టి
సరిహద్దులన్నింటిని దాటుకుని
ఎదగడానికి హద్దు ఆకాశమై కదిలావోయ్

అహర్నిశలు శ్రమించావ్
అనుకున్నది సాధించావ్
అహంకారాన్ని తరిమేశాసావ్
అందరిని చేరదీసావ్
ఆనందంగా ఆదరించావ్

చిన్ననాటి స్నేహాన్ని మదినిండా నింపుకుని
మరచిపోలేదు మారిపోలేదు
మనసారా పలకరిస్తూ
మంచితనాన్ని పంచుతూ
చెలిమికి చిరునామాగా
ప్రతి మనసులో నిలిచావోయ్
ప్రతి హృదిని గెలిచావోయ్

సంధర్భమేదైనా 
పిలిస్తే పలుకుతావ్
దూరమెంతున్నా భారమనకుండ
మా ధరికి చేరుతావ్

బాదలో ధైర్యమౌతావ్
కష్టాలలో ఆదెరువౌవుతావ్
నీ మాటతో సంతోషమిస్తవ్
ఏదేమైనా మా అందరికీ ఆదర్శమౌతావ్

మాటమాటతో మనసంతా ప్రేరణనిస్తావ్
నీవున్నప్పుడు సమయం సంతోషమై సాగిలపడుతది
రోజులన్నీ క్షణాలైపోతయ్
ముత్యలాంటి మనసులోంచి
రతనాల్లాంటి పలుకులు
వజ్రసంకల్పమై వీడిపోని అనుబంధమై అల్లుకుంటయ్

నీవు పంచిన ఆత్మీయానురాగాలు
మా మదిలో చెరిగిపోని శాశ్వత జ్ఞాపకాలు
నీ ఎదుగుదలకు
ఆకాశమే హద్దవ్వాలి
నీవేదనుకున్శా విజయమై  నీ ముందుండాలి

కేరళ సుందరతీరాన
నీ కలల కుటీరం 
బహుసుందరం 
ఆత్మీయ ఆతిధ్యం
మధురాతిమధురం

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480

0/Post a Comment/Comments