కవిత

కవిత

శీర్షిక: మరువని త్యాగానివి

ఛాందస సమాజాన్ని
అర్థంపర్థంలేని ఆచారాలతో
ఆడవాళ్ళు అబలలని
వంటింటికుందేళ్ళుగా చూసే
నాటి సమాజ మనస్తత్వాన్ని
నీచత్వాన్ని పగులగొట్టి
మహిళలందరినీ మార్చే
సరస్వతి రూపానివైనావు
నాటి ప్రతికూల పరిస్థితుల్లో
ఆడవాళ్ళంటే ఆదిపరాశక్తులని
ఎంతో గుండెనిబ్బరంతో
అవమానభారన్ని 
ఎదిరించిన ఓర్పుశిఖరానివైనావు
దురాచారాల్ని దునుమాడే
దేవతామూర్తివైయ్యావు
కుళ్ళిన సమాజంలోని కంపునంతా తరిమి
జ్ఞానపరిమళాల్ని వెదజల్లావు
గడపదాటిన నీ అడుగు 
నింగినితాకే దారయ్యింది
స్త్రీ శక్తిని తట్టిలేపిన
ప్రేరణకిరణానివి
ఎన్నో జ్ఞానజ్యోతులను వెలిగించిన
సావిత్రిబాయిపూలే
మరువబోదు నీ త్యాగం
ఈ భారతదేశం

(సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా)

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments