కల్మషమెరుగని ఆ నవ్వులు
నింగిన పూసిన ఇంద్రధనస్సునడిగి
రంగులేన్నో ఇల పైకి తెచ్చి
పువ్వులెన్నో పూయిస్తారు..
పూలలోని సుకుమారమంతా
తమ తేనె కళ్ళలో బంధించి
చిరునవ్వులన్నీ పరిమళాలతో విరబూయిస్తారు...
వర్ణాల లోగిలిలో
అలుపన్నది లేని బాల్యంతో
వికసించే ఆలోచనల నడుమ
ఉదయించే బాలభాస్కరులుగా
నిత్యం సంతోషాల మూటను
వెంట తీసుకెళ్తారు..
కాముని పున్నమి వేళ
ఆ మెరిసేటి చంద్రవదనాలైన
దివిజ రశ్మిత ఆశృత మిస్సిలు
కలకాలం సంతోషాలతో..
ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటూ..
హోళీ పండుగ వేళ
గ్రీటింగ్స్ పంపిన
ప్రియమైన చిట్టి నేస్తాలకు రంగోళీ శుభాకాంక్షలు...
(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) పంపిన గ్రీటింగ్స్)
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*