వేదాలలో విజ్ఞానాంశాలు Dr. కందేపి రాణీప్రసాద్

వేదాలలో విజ్ఞానాంశాలు Dr. కందేపి రాణీప్రసాద్




వేదాలలో విజ్ఞానాంశాలు
Dr. కందేపి రాణీప్రసాద్ 
"గర్భమునవున్న ఓ శిశువా
నీవుగాలివలె, మనసువలె
ఆకాశమున ఎగురు పక్షివలె
నిరాటంకముగా
పదినెలలు తల్లి కడుపున వుండి
మావి సహితముగా గర్భము నుండి వేడలుము"
భారతీయ సాహిత్యంలో అతి ప్రాచీనమైనవనీ, పవిత్రమైనవని భావిస్తున్న వేదాల్లో ఒకటైన అధర్వణవేదం ఐదవ సూక్తంలోని అరవరుక్కు శిశువు మాతృగర్భంలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు ఎంత స్వేచ్చగా, ఎంత స్వచ్చంగా ఉండాలో చెప్పింది. అలా రమ్మని ఆహ్వానించింది. వేద సాహిత్యంలో అనేకచోట్ల దేవతల్ని, ప్రకృతి శక్తుల్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారికీ పిల్లలతో పోలికలు చెప్పడం కనిపిస్తుంది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వేదాల్లో ఆనాటి బాల్యచిత్రణ పుష్కలంగానే లభిస్తుంది".
భారతీయ సంస్కృతిలో సాంప్రదాయలు ఆచార వ్యవహారాలు ఆధ్యాత్మికతా మార్గంలో ముడిపడి ఉన్నప్పటికీ దానిలో వైజ్ఞానికత కూడా అంతర్లీనంగా దాగి ఉంది. మన భారతీయ సంస్కృతికి వేదాలు, ఉషానిషత్తులు, ఇతిహాసాలు వంటి ప్రాచిన పురాణ గ్రంధాలు మూలగ్రంథాలుగా పరిగణింపబడ్డాయి. వైజ్ఞానిక అంశాలను సమ్మిళితం చేసి ప్రాచిన భారతీయ రుషులు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు. పరాశరుడు, వశిష్టుడు, అగస్త్యుడు, కాశ్యపుడు, భ్రగు, చరక్షుడు, కణాదుడు, కాత్యాయనుడు, గర్గుడు, శౌనకుడు, శుక్రుడు, నారదుడు వంటి ఎందరో మహర్షులు వైజ్ఞానిక విషయాలున్న గ్రంథాలను రాశారు. ఇవన్ని సంస్కృత భాషలో రాసి ఉండటం వల్ల అవి తక్కువ మంది మాత్రమే చదివి అర్థం చేసుకోగలిగారు. ప్రాచిన గ్రంథాలలో విజ్ఞానాన్ని సందర్భానుసారంగా జోడించారు.
మనదేశంలో వేల సంవత్సరాల క్రితమే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. మన భారతీయులు ప్రకృతికి, సంప్రదాయాలకు అనుకూలంగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రాచిన వైజ్ఞానికులు ఆయుర్వేదం, గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, వాస్తు శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి శాస్త్రాలతో గ్రంథాలను వెలువరించారు. మానవుడు ప్రకృతితో మమేకమై, మిగతా జంతుజాలాలతో మిత్రత్వం నెరిపినాడు. కానీ ఆధునిక సమాజంలో మానవుడు ప్రకృతికి దూరంగా, జీవజాలానికి దూరంగా యంత్రాలతో సహవాసం చేస్తున్నాడు. అందుకే ప్రస్తుత మానవులు తోటి మనుషుల బాధలకు స్పందించడం మానేసి బండరాళ్ళలా ఉంటున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి.
మన భారతీయులు ప్రకృతి అరాధకులు, సముద్రాలూ, జలపాతాలు, అరణ్యాలు, పర్వతాలు, కొండకోనలు, తూర్పుపశ్చిమ కనుములు, హిమాలయాలు, నదులు, చెట్లు,చేమలు, వన్యప్రాణులు, వనాలు వంటివన్నీ ప్రకృతిలోనివే. వేద కాలాల్లోని ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. ఋగ్వేదం, అధర్వణ వేదాలలో ప్రకృతి వర్ణన చాలా ఉంటుంది. రామాయణ మహాభారతాలు వంటి ఇతిహాసాలలో గిరులు, నదులు, చెట్లు- చేమలు, వాగులు, వంకలు వంటి వాటి గురించి అష్టాదశ వర్ణన కనిపిస్తుంది. రాముని అరణ్యవాసం, పాండవ వనవాసమంతా పూర్తిగా ప్రకృతిలోనే గడిచింది. కాళిదాసు కావ్యాలలో కూడా ప్రకృతి వర్ణన అధ్బుతంగా ఉంటుంది.
"సూర్యుడు, నీరు, ఔషధాలు, అడవులు, చెట్లు మరియు పర్వతాలు మన రక్షణకు బాధ్యులని, వీటికి హాని కలగడం జీవకోటి ఉనికికే చాలా ప్రమాదమని ఋగ్వేదంలో స్పష్టం చేయబడింది".
( ఋగ్వేదం 5-41-11 )
సౌరకుటుంబం, నీరు, ఔషదాలు, గాలి, మేఘాలు, నదులు, అరణ్యాలు, మరియు పర్వతాలు ఇవన్నియు సమస్త జీవకోటిని రక్షించమని ప్రార్థన చేసే శ్లోకాలు ఋగ్వేదంలో ఉన్నాయి".
( ఋగ్వేదం 10-35-2, 10-66-9, 10-66-10, 10-64-8 )
మహాకవి కాళిదాసు 'కుమార సంభవం'లో పర్వతాలను గూర్చి ఇలా వర్ణించాడు.
"అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ!
హిమాలయో నామ నగాధి రాజ:"
పర్వతాలను మనం మామూలు కంటతో చూస్తే రాళ్ళు రప్పలుగా కనిపించవచ్చు. కానీ కాళిదాసు వాటిని దేవతా స్వరూపాలని, గిరి దేవతలకు నిలయమని పేర్కొన్నాడు. హిందువులు హిమాలయాలను దేవతలు సంచరించే ప్రదేశాలుగా భావిస్తారు. కనుకునే హిమాలయాల్లో నెలకొని ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు దివ్యక్షేత్రాలు మనకు పవిత్ర యాత్రా స్థలాలుగా మారాయి. ఇంతకాక మనం కలియుగ దైవంగా పూజించే వేంకటేశ్వరుడు కూడా తిరుపతి కొండల్లో కొలువై ఉన్నాడు. ప్రముఖమైన దేవాలయాలన్నీ కొండలపైనే ఉన్నాయి.
వృక్షశాస్త్రం
అధర్వణవేదంలో మొక్కలను, వాటి లక్షణాలను బట్టి మరియు ఆకృతులను బట్టి వాటిని ఏడు తరగతులుగా విభజించినట్లు చెప్పబడింది. చరక, సుసృత, పరాశర, ఉదయన మొదలైన మహర్షులు మొక్కలకు కూడా ప్రాణముందని, వాటిలో ఇంద్రియాలు ఉంటాయని, వాటిని రోగాలు కూడా వస్తాయని, సుఖదుఃఖాలు స్పందిస్తాయని వేర్ల ద్వారా భూమిలోని నీటిని పీల్చుకుంటాయనీ తమ గ్రంథాలలో వివరించారు. వృక్షాలకు ప్రాణమున్నదని వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీనులు గుర్తించినట్లు మహాభారతంలోని శాంతిపర్వంలోని ఈ కింది శ్లోకాన్ని బట్టి తెలుస్తున్నది.
"సుఖ దుఃఖ యోశ్చ గ్రహణాచ్చిత్రస్యచ విరోహణత్
జీవం పశ్యామి వృక్షానామ్ అచైతన్యం న విద్యతే"
వృక్షాన్ని గొడ్డలితో నరికేస్తే అది మోడువారి పోదు. నరికిన చోటనే మరలచి గురించి వృక్షంగా పెరుగుతుంది. అవి సుఖదుఖాలను అనుభవిస్తున్నాయి. కాబట్టి వృక్షాలకు ప్రాణమున్నదని బృగుమహర్షి శాంతిపర్వంలో వివరించాడు. అలాగే 'వృక్షాయుర్వేదము' అనే గ్రంథంలో వృక్షశాస్త్రం గురించి విపులంగా పరాశర మహర్షి చర్చించాడు.
"ఆత్ర సేంద్రియత్వచ వృక్షాది నామాసి చేతనత్వమ్ బోద్దద్యమ్"
క్రీ.పూ. 700ల సం.లకు పూర్వమే చరకుడు వృక్షాలకు ప్రాణమున్నదని వాటికీ ఇంద్రియాలు కూడా ఉంటాయని తెలిపాడు. ఇతడు 'చరకసంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. ఇందులో 350 రకాల ఔషద విలువలున్న మొక్కలను గురించి విపులంగా చర్చించారు. అలాగే 'మత్స్యపురాణం' కూడా 85 రకాల ఔషధ మొక్కలను, వాటి లక్షణాలను, ధర్మాలను, సేవించే విధానం, తీసుకోవలసిన పరిమాణం గురించి ఆయుర్వేద గ్రంథాలలో వివరంగా చెప్పబడింది. రావిచెట్టు, తులసి చెట్లను పవిత్రంగా భావించి దేవాలయాలలో ఉంచి పూజిస్తున్నాము.
బిల్వవృక్ష మహాభాగ సదాత్వం శంకరప్రియ
గృహిత్వా తవ శాఖాం చ దేవీ పూజాం కరోమ్యహమ్
శాఖాచ్చేదో ద్భవం దుఃఖం న చ కార్యం త్వయా ప్రభో
గృహీత్వా తవ శాఖం చ పూజ్య దుర్గేతి చ స్మృతి:
ఓ బిల్వవృక్షమా! నీవు శంకరునకు అత్యంత ప్రీతీ పాత్రమైన దానవు. దేవీ పూజా కోసం నీ ఆకులను కోసినప్పుడు కొమ్మలకు బాధ కలిగించాను. పూజా కోసం, ప్రతి మొక్కల నుండి కోస్తున్నప్పుడు మొక్కలకు బాధ కలుగుతుందని, బాధ కలిగిస్తున్నందులకు వృక్షాల్ని కోరుతున్నారు.
వేపచేట్టులో ఔషద విలువలున్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. తట్టు, పొంగు, మశూచి, చర్మవ్యాధులు వంటి అనేక వ్యాధులకు ఈ చెట్టు ఆకులూ పనికొస్తాయి. వేపపుల్లలతో పళ్ళు తోముకుంటే పళ్ళు పుచ్చిపోకుండా వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

గణిత శాస్త్రం
ప్రపంచంలో మొట్టమొదట 'సున్నా'ను కనుక్కున్నా గొప్పదనం భారతీయ పేద సంస్కృతికే దక్కింది. దీనికి 'ఈశావ్యాసోనిషత్తు'లోని శాంతిమంత్రము ఆధారము.
"పూర్ణ మద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
  పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వా శిష్యతే"
ఇదీ పూర్ణమే అది పూర్ణమే. పూర్ణము నుండియే పూర్ణము ఏర్పడుచున్నది. అయినప్పటికీ అదియును కూడా పూర్ణమే. ఇక్కడ పూర్ణము అనగా శూన్యము. శూన్యము శూన్యముతో కలిసినప్పుడు ఏర్పడేది కూడా శూన్యమే. అలాగే శూన్యములో నుంచి శూన్యము తిసివేసినపుడు వచ్చేది కూడా శూన్యమే. అంటే సున్నా అని అర్థం. వేదకాలంలో మన ప్రాచీనులు ఆవిష్కరించిన సున్నా గణిత శాస్త్రం యొక్క గొప్ప అవిష్కరంగా భావించవచ్చు. అర్యభట్టుడు, భాస్కరుడు, బ్రహ్మగుప్తుడు, వరాహ మిహిరుడు మొదలైన మేధావులంతా గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఎన్నో గ్రంథాలను రచించారు.



ఖగోళ శాస్త్రం
వేల సంవత్సరాల క్రితమే వేడ గణితం ప్రారంభమైందని తెలుసుకున్నాం. అలాగే అప్పటి ఋషులకు ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఎంతో మక్కువగా ఉంది. ఈనాటికి ఉజ్జయినిలో వేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రవేత్తలు వదిన అంతరిక్ష ప్రయోగశాలలను చూడవచ్చు. గ్రహాల గమనాన్ని బట్టి 'పంచాంగము' తయారు చేశారు. సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాన్ని చక్కగా లెక్కకట్టగలిగారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనుక్కున్నా లెక్కలకు, పంచాంగపు లెక్కకు సరిపోయింది. అంటే మన ప్రాచీనులు వేడ కాలంలోనే ఖగోళ శాస్త్రంలో ఎంతో ముందడుగు వేయగలిగారు. వేదాలు భూమ్యకాశాలను తల్లిదండ్రిగా పరిగనించాయి. భూమి మనతల్లి అని మనమందరం దాని పిల్లలమని అధర్వణ వేదము సూచిస్తోంది. యజుర్వేదం ప్రకారం భూమి తల్లి అనియు, ఆకాశం తండ్రి అనియు, తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా ఎలా చూస్తారో భూమ్యాకాశాలు కూడా మనల్ని అలాగే కాపాడతాయనియు తెలుస్తున్నది. ప్రకృతిని కాలుష్యం నుండి కాపాడుకోవటం మానవుల కర్తవ్యమని అధర్వణవేదం లోని ఈ కింది శ్లోకాలు తెలియజేస్తున్నాయి.
అధర్వణవేదం 12-1-12, 6-120-2
యజుర్వేదం    2-10-11
"మనోన యో ద్వన: సద్య గత్యేక:
సత్రా సూర్యో వస్వ ఈశే"
భరణి ర్విశ్వ దర్శతో జ్యోతి కృదసి
సూర్య విశ్వమా భాసి రోచనమ్" ( ఋగ్వేదం )
సూర్యుడు మనోవేగంతో స్వర్గ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. సూర్యుడు జ్యోతివలె ప్రకాశిస్తున్నాడు. అలాగే విశ్వమంతటిని ప్రకాశింపజేయుచున్నాడు.
యజుర్వేదంలోని 31వ అధ్యాయంలో సూర్యుని విధులను ప్రస్తావించింది. సూర్యుడు భూమిపై వర్షాలు కురిపిస్తాడని, తద్వారా ఆహారం తయారై జీవ జాలానికి ఆహారన్నిస్తాడని తెలిపింది. ఋగ్వేదంలో సూర్యుని ప్రశంసించే ప్రస్తావనలు చాలా చోట్ల కనిపిస్తాయి. సూర్యుడు రోగాలను పారద్రోలుతాడని ఋగ్వేదంలో చెప్పబడింది.

రసాయన శాస్త్రం
'వైశేషిక దర్శనమ్'లో కణాదుడు అనువుల్ని, వాటి లక్షణాలని వివరించాడు. పదార్థాన్ని విభజించుకుంటూ వెళితే ఇక విభజించటానికి వీలులేని సూక్ష్మాతి సూక్ష్మ కణాలు ఏర్పడతాయని కణాదుడు కనిపెట్టాడు. దీని ఆధారంగా కణ సిద్దాంతాన్ని ఆవిష్కరించాడు. ద్రవ్యము రెండు స్థితులను కలిగి ఉంటుంది. ఒకటి అతిసూక్ష్మాతి, రెండవది స్థూల స్థితి. సూక్ష్మస్థితి లో ద్రవ్యము అతిచిన్న కణాలు అనుస్థితిని కలిగి ఉంటాయి. రెండవదైన స్థూల స్థితిలో  అతివిశాలమైన బ్రహ్మాండంలాగా ఉంటుంది. ఇదే మహత్ స్థితి అని అంటారని కాణాద మహర్షి వర్ణిస్తాడు.

0/Post a Comment/Comments