సోమన్న విరచిత మూడు పుస్తకావిష్కరణలు మరియు "బాలబంధు" బిరుదు ప్రదానం-ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత మూడు పుస్తకావిష్కరణలు మరియు "బాలబంధు" బిరుదు ప్రదానం-ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత మూడు పుస్తకావిష్కరణలు మరియు  "బాలబంధు" బిరుదు ప్రదానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 36వ, కొత్త పుస్తకం 'వెన్నెల వాన'తో పాటు సమతా సాహితీ సుమాలు,తుషార బిందువులు  వారి మరి రెండు పుస్తకాలు రాఘవ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు,కళాబంధు శ్రీ కె.చెన్నప్ప, రాఘవ స్మారక సమితి ఉపాధ్యక్షులు, ప్రఖ్యాత రంగస్థల కళాకారులు శ్రీ రమేష్ గౌడ పాటిల్,డా.ఎ. లక్ష్మీనారాయణ మరియు సమతా సాహితీ సంస్థ అధ్యక్షులు డా.శ్రీ కె.సురేంద్ర బాబు గారల చేతుల మీద కర్ణాటక రాష్ట్రంలోని రాఘవ కళామందిరం,బళ్ళారిలో  ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం సోమన్న విరచిత "సమతా సాహితీ సుమాలు" పుస్తకాన్ని శ్రీ సురేంద్ర బాబు దంపతులకు అంకితం చేశారు. అనతి కాలంలో 36పుస్తకాలు రచించిన, బాలసాహిత్యవేత్త సోమన్నను వారి తెలుగు సాహితీ కృషి గాను "బాల బంధు" బిరుదుతో సమతా సాహితీ సంస్థ అధ్యక్షులు డా.శ్రీ.సురేంద్ర బాబు,కార్యదర్శి శ్రీ రామాంజనేయులు మరియు సభ్యులు సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్య కవి శ్రీ ఈశ్వరప్ప,కవిరత్నశ్రీ నాగేశ్వరరావు, హెచ్
విష్ణువర్ధన్, శ్రీ నీలకంఠ మరియు రాఘవ కళామందిరం ఇబ్బంది  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments