దశాబ్ది ఉత్సవాల్లో రచయిత రాథోడ్ శ్రావణ్ కు ఘన సత్కారం

దశాబ్ది ఉత్సవాల్లో రచయిత రాథోడ్ శ్రావణ్ కు ఘన సత్కారం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  "తెలంగాణ సాహిత్య దినోత్సవం" ‌సందర్భంగా తెలంగాణ హస్తిత్వం , అమరవీరుల త్యాగాల గురించి
జిల్లా  కవులచే కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 

జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ ,జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ప్రసిద్ద కవులైన   కాళోజీ నారాయణ రావు, సామల సదాశివ గార్లకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం జిల్లా యువజన సంక్షేమ శాఖ కమిటీ ఆధ్వర్యంలో  జరిగినది. ఈ కవి సమ్మేళన కార్యక్రమంలో రచయిత, ఉపన్యాసకులు, ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ ను కమిటీ సభ్యులు ఎంపిక చేసి  సాహితీ రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి టి. ప్రణిత,యువజన క్రీడల అధికారి వేంకటేశ్వర్లు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, విజయ డెయిరీ డైరెక్టర్ మధుసూదనా చారి,
మరియు కవులు,కళాకారులు, రచయితలు, సాహితీ అభిమానుల  ఆధ్వర్యంలో  శాలువాతో ఘనంగా  సన్మానించి పారితోషికం ఇచ్చి ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేశారు

0/Post a Comment/Comments