సోమన్న విరచిత"అమ్మ ఒడి-ప్రేమ బడి" పుస్తకావిష్కరణ మరియు బాబుశ్రీ గారికంకితం

సోమన్న విరచిత"అమ్మ ఒడి-ప్రేమ బడి" పుస్తకావిష్కరణ మరియు బాబుశ్రీ గారికంకితం

సోమన్న విరచిత"అమ్మ ఒడి-ప్రేమ బడి" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన 38వ కొత్త పుస్తకం 'అమ్మ ఒడి-ప్రేమ బడి' బాలగేయాల సంపుటి '  గురు సహస్రావధాని శ్రీ కడిమిళ్ల వర ప్రసాద్,శ్రీ పెన్మేత్స సత్యనారాయణ మరియు శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్యం గారల చేతుల మీద అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శ్రీ పెన్మేత్స సత్యనారాయణ రాజు దంపతులకు 'అంకితం' ఇవ్వడం జరిగింది.అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు,ఉపాధ్యాయులు శ్రీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజి,  డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, షేక్ సిలార్ సాహెబ్,శ్రీ మంకు శ్రీను,గాదిరాజు రంగరాజు మరియు పుర ప్రముఖులు    పాల్గొన్నారు.సన్మాన గ్రహీత కవిరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments