సోమన్న విరచిత"e-తరం బాలలు" పుస్తకావిష్కరణ మరియు సన్మానం-గద్వాల సోమన్న

సోమన్న విరచిత"e-తరం బాలలు" పుస్తకావిష్కరణ మరియు సన్మానం-గద్వాల సోమన్న

సోమన్న విరచిత"e-తరం బాలలు" పుస్తకావిష్కరణ మరియు  సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన 37వ కొత్త పుస్తకం 'e-తరం బాలలు' బాలగేయాల సంకలనం అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్  డా.కత్తిమండ ప్రతాప్ మరియు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ జడ్జి శ్రీ నరహరి నారాయణ రెడ్డి మరియు శ్రీ ఏ.యల్.కృష్టారెడ్డి గారల చేతుల మీద "తెలంగాణ సారస్వత పరిషత్ " హైదరాబాద్ లో  ఘనంగా ఆవిష్కరించారు. కవితాగానం అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేశవయ్య,నాగేశ్వరరావు,డి. వీరేష, శ్రీశ్రీ కళావేదిక జాతీయ, రాష్ట్ర  సభ్యులు  మరియు కవులు   పాల్గొన్నారు.సన్మాన గ్రహీత కవిరత్న గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments