శీర్షిక: సర్కారుబడి

శీర్షిక: సర్కారుబడి

శీర్షిక : సర్కారుబడి 

ప్రభుత్వ పాఠశాలలు 
సమస్యలకు నిలయాలు 
ఒకప్పుడవి 
పరమపవిత్ర దేవాలయాలు 
నేడవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు 
సరస్వతిదేవి నెలువుండే 
పవిత్రమైన విద్యాలయాలు 

బతుకును మార్చి భవితను తీర్చేవి 
అజ్ఞానాన్ని తరిమి విజ్ఞానాన్ని వికసింపజేసేవి

వెనుకబడిన జాతులన్ని
పేదరికాన్ని జయింపలేక
చెమటతో చదువు కొనలేక
శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న
ఆశచావక సాధించాలనే తపనతో
తమ నడక సాగించే మాలాంటి
వారికి అభయాస్తాలు 

సౌకర్యాలు సరిగాలేక 
పట్టింపెవరికి లేని
అనాధలా కనిపిస్తుంది బడి

విజయకుమారి,
9వ తరగతి,
జి.ప.ఉ.పాఠశాల,
అమడబాకుల

0/Post a Comment/Comments