సోమన్న విరచిత"నిండు జాబిలి" పుస్తకావిష్కరణ --ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత"నిండు జాబిలి" పుస్తకావిష్కరణ --ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత"నిండు జాబిలి" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన 39వ కొత్త పుస్తకం 'నిండు జాబిలి' బాలగేయాల సంపుటి సామాజిక  సేవకురాలు,విశ్రాంత మండల విద్యాధికారిణి  శ్రీమతి హెచ్. రామలింగమ్మ , సహజ కవి శ్రీ సవ్వప్ప గారి ఈరన్న ,సబిన్స్పెక్టర్ డా.నాయక్  మరియు ప్రతాప్ స్వామి గారల చేతుల మీద కర్నూలు జిల్లాలోని ఆలూరు శాఖా గ్రంథాలయమందు  గ్రంథాలయాధికారి శ్రీ యన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు,ఉపాధ్యాయులు కళాకారులు శ్రీ డి. కేశవయ్య,బి.టి.లక్ష్మణ, లైబ్రరీయన్ శ్రీ విజయభాస్కర్ ,రామూర్తినాయుడు,గ్రంథాలయ సిబ్బంది, పుర ప్రముఖులు, మరియు పాత్రికేయులు     పాల్గొన్నారు.సన్మాన గ్రహీత కవిరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments