తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి" ప్రత్యేక అతిథి"గా కల్పన దేవసాని

తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి" ప్రత్యేక అతిథి"గా కల్పన దేవసాని

 

తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి" ప్రత్యేక అతిథి"గా కల్పన దేవసాని


కామారెడ్డి జిల్లా, తెలంగాణ, సెప్టెంబర్ 21,2023: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక  సెప్టెంబర్ 24 వ తేదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరీ", అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి  కల్పన దేవసాని ప్రత్యేక అతిథిగా తానా  సంస్థ వారు ఆహ్వానించారు.

తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వం వినిపించటానికి తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగ వరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే సాహిత్య సమ్మేళనం ఇది. భారత్ తో పాటు  విశ్వ వ్యాప్తంగా  సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు ప్రముఖ మహిళలు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో  జరిగే ఈ కార్యక్రమం 10 కి పైగా మాధ్యమాలలో  ప్రత్యేక్ష ప్రసారం చేస్తారు. యాప్ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు,అమెరికా వంటి దేశాల్లో, ఈ టీవీ భారత్, మన టీవీ, తెలుగు వన్, తానా అధికారిక యుట్యూబ్ ఫేస్బుక్ చానెల్ వంటి చానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమంలో తమను ఎంపిక చేసినందుకు కల్పన హర్షం వ్యక్తం చేశారు.

బాన్సువాడ మండలంలో గురుకుల ఉపాధ్యాయురాలిగా గా సేవలు అందిస్తున్న కల్పన అనేక వచన కవితలు, గేయాలు నవలలు రచించారు. రచయిత్రి గా, గాయనిగా ప్రఖ్యాతి పొందారు. సామాజిక సేవలో ప్రధాన భూమిక పోషిస్తూ కావ్యలహరి సంస్థ ద్వారా అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు.  కల్పన కు  ఈరోజు తానా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల కామారెడ్డి జిల్లా లోని పలువురు పెద్దలు, కవి పండితులు స్నేహితులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

0/Post a Comment/Comments