గాంధీజీ

గాంధీజీ

మహాత్మ మళ్ళీ పుట్టు
నీవు ప్రతిపాదించిన
అహింస లో ఆ తొలిగి
హింసనే రాజ్యంఏలుతుంది
ఒంటరిగా అర్ధరాత్రి స్వేచ్ఛగా
తిరుగుట నీ కళ్ళద్దాలను
చూడు పట్టపగలే తిరుగని
 స్థితి సత్యం సత్యాగ్రహమే
 నీ ఆయుధాలు
 నీవు కలలు కన్న  గ్రామ స్వరాజ్యం తూట్లు పడింది
గాంధీ రాజ్యం లో స్వచ్ఛమైన
పాడలి బ్రాంతి
బార్లు,బీర్లు బ్రాండ్లు అయి
అందుబాటులోకి లేదు
కొరత బ్రాందీకి
సర్వోదయం బడా పారిశ్రామిక
వేత్తలు తేజోదయంగా మరి
కుటీర పరిశ్రమలు కుంటుపడే
నెట్టు ఇంటర్నెట్ లో కాలక్షేపాలు
అంతకరణ శుద్ధి లేదు
ఆత్మీయద్రోహాలు ఎక్కువ అయ్యాయి
అవినీతి రాకెట్ ల దుసకపోతే
నీతి నెలబారింది
సూర్యుడు అస్తమించిన
సామ్రాజ్యాన్ని శాంతియుతంగా
జయించి వలస వాదం
అంటరాని తనం
జాతి వివక్ష పై రణం
చేసి ప్రపంచ నాయకూడవు
అయ్యావు
నిజంగా నీవు మహాత్ముడివే
మళ్ళీ మళ్ళీ పుట్టు
నా దేశాన్ని రక్షించు
11 వ అవాతారం గా
ఈ భువి పై ఇటువంటి
వ్యక్తి నడియడడా అనే
ఐన్స్టీన్ సందేహం
నివృత్తి చేయ
వైద్య.శేషారావు
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె.సి దోమకొండ
9440408080

0/Post a Comment/Comments