"పల్నాడు బాలోత్సవంలో ప్రాస పద గేయాలు" పుస్తకావిష్కరణ -ప్రవాహిని న్యూస్

"పల్నాడు బాలోత్సవంలో ప్రాస పద గేయాలు" పుస్తకావిష్కరణ -ప్రవాహిని న్యూస్

"పల్నాడు బాలోత్సవంలో ప్రాస పద గేయాలు" పుస్తకావిష్కరణ 
--------------------------------------
కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు,తెలుగు బంధువు  గద్వాల సోమన్న  రచించిన 45వ కొత్త పుస్తకం "అక్షర పద గేయాలు" బాలగేయాల సంపుటి యం.ల్.సి శ్రీ కె.యస్.లక్ష్మణరావు ,గాంధీ స్మారక సమితి అధ్యక్షులు శ్రీ ఈదర గోపీచంద్ ,బాలోత్సవం కమిటీ నిర్వాహకులు శ్రీ కట్టా  కోటేశ్వరరావు,అసిస్టెంట్ రిజిస్ట్రార్ యస్.చిన రామిరెడ్డి,  విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ యం.యస్.ఆర్.కె.ప్రసాద్ మరియు శ్రీ కోడెల శ్రీను గారల చేతుల మీద కె.ఆర్.కాలేజ్, పి.యన్.సి ఆడిటోరియం , బాలోత్సవం వేదికపై,నరసరావుపేట ,పల్నాడు జిల్లాలో  ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాన్ని  సోషల్ వర్కర్,విద్యాదాత శ్రీ శ్రీనివాసరావు గారికి అంకితమిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు,ఉపాధ్యాయులు రాగినేని వేమలయ్య,మాన్సింగ్ ,రవి కృష్ణ,కళాకారులు  పాత్రికేయులు   మరియు  జిల్లా స్థాయి అంతర పాఠశాలల పాటల పోటీ విద్యార్థులు పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments